కరోనా సెకండ్ వేవ్ అన్న దగ్గరనుండి అంటే ఏప్రిల్ 15 నుండి ఏపీలో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూస్ ని ఏపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేసింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ లు ఎత్తేసినా, థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు నైట్ కర్ఫ్యూ, థియేటర్స్ దగ్గర నిబంధనలు అమలు చేస్తుంది. ఇక జులై నుండి ఇప్పటివరకు ఏపీలో 50 శాతం అక్యుపెన్సీతోనే థియేటర్స్ రన్ అవుతున్నాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు నైట్ కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపిన ఏపీ ప్రభుత్వం.. దాంతోపాటు సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిచ్చింది. దసరా స్పెషల్ గా థియేటర్స్ 100 శాతం పని చేయనున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్స్ లో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం రేపటి నుంచి అమలులోకి రానుంది. దానితో సినిమా ఇండస్ట్రీకి దసరా పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టయింది.