బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఐదో కంటెస్టెంట్ గా బయటికి వచ్చిన హమిదా హైలెట్ అవ్వడానికి ఏదోఒకటి బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పలేదు. తనకి నచ్చినవి, నచ్చనవి అన్ని నాగ్ దగ్గరే చెప్పిన హమీద.. బయటికి వచ్చాక కూడా పెద్దగా కాంట్రవర్సీ వర్డ్స్ మాట్లాడలేదు. బిగ్ బాస్ లో శ్రీరామ్ లవర్ గా హమీద గనక బిగ్ బాస్ హౌస్ లో ప్రొజెక్ట్ అవ్వకపోతే ఆమె కి కనీసం ఫుటేజ్ కూడా దొరికేది కాదనేది వాస్తవం, పెద్దగా ఫేమ్ లేని హమీదా శ్రీరామ్ తో హగ్గులు, ముద్దులతో బాగా హైలెట్ అయ్యి హౌస్ నుండి బయటికి వచ్చాక హౌస్ మేట్స్ గురించిన అభిప్రాయాలను థాంక్స్ మీట్ ద్వారా షేర్ చేసింది.
బిగ్ బాస్ హౌస్ లో సన్నీ మిస్టర్ మజ్ను అని, షణ్ముఖ్ పెదరాయుడు అని, జెస్సి పిల్ల బచ్చా అంటూ చెప్పింది. ఇక కాజల్ మాత్రం ఫేక్ గేమ్ ఆడుతుంది అని, ఓవర్ గా థింక్ చేస్తుంది అని.. అక్కలా భావించి అన్ని షేర్ చేసుకున్నాను. కానీ ఆమె టాస్క్ కోసం రిలేషన్ నే పక్కనపెట్టేసింది. ఇక ప్రియా గారు మాత్రం ఫిట్టింగ్ మాస్టర్. బిగ్ బాస్ హౌస్ లో అందరితో క్లోజ్ గా ఉంటూనే ఉంటుంది.. అందరి మధ్యలో పుల్లలు పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక శ్రీరామ్ర్ మాత్రం నా లవర్ లా ప్రొజెక్ట్ అయినా అతను నా లవర్ కాదు, శ్రీరామ్ ఓ హిట్లర్ అంటూ హమీద బిగ్ బాస్ ప్రయాణంలో తన అనుభవాలను చెప్పుకొచ్చింది.