Advertisementt

ఆర్యన్ ఖాన్ సెలెబ్రిటీ అయితే మాకేంటి

Wed 13th Oct 2021 06:14 PM
aryan khan,night in jail,bail hearing,shahrukh khan  ఆర్యన్ ఖాన్ సెలెబ్రిటీ అయితే మాకేంటి
Aryan khan to spend another night in jail ఆర్యన్ ఖాన్ సెలెబ్రిటీ అయితే మాకేంటి
Advertisement
Ads by CJ

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ఆయన శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. షారుఖ్ లాయర్ ఎంతగా వాదించినా ఆర్యన్ ఖాన్ కి అయితే బెయిల్ మంజూరు కావడం లేదు. ఇప్పటికి కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పై వాదనలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా జ్యుడిషియల్ కష్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ అసలు క్రూయిజ్ షిప్ లోనే లేడు అంటూ షారుఖ్ లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీలో ఇప్పటివరకు ఎన్సీబీ 20 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీలో పట్టుబడడంతో.. మిగతావారిని ట్రీట్ చేసినట్లుగానే ఆర్యన్ ఖాన్ ని కోర్టు ఎన్సీబీ అధికారులు ట్రీట్ చెయ్యడమే కాదు.. కోర్టు వాదనలలో.. ఆర్యన్ ఖాన్ సెలెబ్రిటీ అయితే మాకేంటి.. ఆయనకి బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారవుతాయంటూ ఎన్సీబీ వాదిస్తుంది.

ఆర్యన్ ఖాన్ బెయిల్ పై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది. దానితో మరో రోజు సాధారణ ఖైదీ లాగే ఆర్డర్ జైల్లోనే ఆర్యన్ ఖాన్ ఉండనున్నారు. ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరకలేనప్పుడు ఎన్సీబీ ఇలాంటి ఆరోపణలు చెయ్యడం తగదంటూ షారుక్ లాయర్ వాదిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ కి ఇంకా బెయిల్ రాకపోవడంతో షారుఖ్ దంపతులు చాలా ఫీలవుతున్నారు. మరి రేపు విచారణలో ఆర్యన్ ఖాన్ బెయిల్ పై అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Aryan khan to spend another night in jail:

Aryan khan to spend another night in jail, Bail hearing postponed 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ