టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ని ఇప్పుడు టాలీవుడ్ చిన్న చూపు చూస్తుంది. హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ రకుల్ చాలా బిజీ.. తెలుగు సినిమాలు ఒప్పుకునే టైం లేదు అన్నా, నేను ఒకే ఏడాది ఎన్ని సినిమాలు చేస్తాను.. కొన్ని మాత్రమే చెయ్యగలను.. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది అని రకుల్ అన్నా.. ప్రస్తుతం అయితే రకుల్ కి తెలుగులో సినిమాలు లేవు ఇది వాస్తవం. బక్క చిక్కిన రకుల్ ఈమధ్యన టాలీవుడ్ లో కొండ పొలం సినిమా లో ఓబులమ్మగా డీ గ్లామర్ రోల్ లో కనిపించింది.
లుక్ ఓకె, పెరఫార్మెన్స్ ఓకె.. బట్ సినిమానే ప్రేక్షకులు ఆదరించలేదు. ఇక టాలీవుడ్ లో ఉన్న ఏకైక తెలుగు సినిమా కూడా రకుల్ కి భారీ షాకిచ్చింది. అసలే చేతిలో సినిమాలు లేవు.. కొండపొలం అయినా హిట్ అవ్వుద్ది అనుకుంటే అదీ షాకిచ్చింది. మరి బాలీవుడ్ లో బాగా బిజీగా వున్న రకుల్.. అక్కడ సినిమాల్లోనూ పెద్దగా హిట్ కొట్టిన దాఖలాలు లేవు. కానీ సోషల్ మీడియాలో రకుల్ ఆరబోసే అందాలకు యూత్ ఎప్పుడూ ఫిదానే.. తాజాగా ఓ ఫ్రాక్ లో రకుల్ అందాల ఆరబోత మాములుగా లేదు.. క్లివేజ్ షో తో పిచ్చెక్కించేసింది. ఏదైనా రకుల్ ప్రీత్ కి టాలీవుడ్ భారీ షాకిచ్చింది.