ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్న రామ్ చరణ్ క్రేజ్ మాములుగా లేదు. జనవరి లో రిలీజ్ కాబోయే ఆర్.ఆర్.ఆర్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత క్రేజీ మల్టీస్టారర్ ఆచార్య లో నటిస్తున్నాడు. ఆచార్య కూడా ఫిబ్రవరి 4 న రిలీజ్ కాబోతుంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో సినిమాకి రెడీ అవుతున్నాడు. అక్టోబర్ థర్డ్ వీక్ నుండి RC15 షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి.. రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ ఉంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీ భారీ బడ్జెట్ తోనూ, శంకర్ మూవీ కూడా 300 కోట్ల బడ్జెట్ తోనూ తెరకెక్కబోతుంది. అందుకే రామ్ చరణ్ కూడా శంకర్ తో చెయ్యబోయే RC15 మూవీ కోసం భారీ పారితోషకం తీసుకోబోతున్నాడనే టాక్ ఉంది. RC15 కి రామ్ చరణ్ దాదాపుగా 80 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇది రామ్ చరణ్ రేంజ్ అంటున్నారు మెగా ఫాన్స్. మరి ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని, అలాగే మరో టాప్ హీరో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తుంది.