బిగ్ బాస్ 5 లో సోమవారం నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కించింది. నామినేషన్స్ ప్రక్రియ వాడిగా వేడిగా కాదు.. మంటలు రేగేలా చేసాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఈసారి మంట పెట్టి అందులో ఫొటోస్ కాల్చమనేసరికి.. ఒక్కో కంటెస్టెంట్.. అనుబంధాలను వీడి మరీ నామినేట్ చేసుకున్నారు. ఎప్పటిలాగే సిరి, షణ్ముఖ, జెస్సి బ్యాచ్ ని అందరూ నామినేట్ చెయ్యగా.. షణ్ముఖ్ మాత్రం కాస్త యాటిట్యూడ్ చూపిస్తూ శ్రీ రామ చంద్ర నువ్వు దేవుడివా బిగ్ బాస్ హౌస్ కి.. నువ్వు చెప్పినట్టు వినాలా అంటూ రెచ్చిపోయాడు. ఇక సన్నీ - జెస్సి, సన్నీ - ప్రియల మధ్యన వార్ జరిగింది. ఆని మాస్టర్ కి విశ్వ కి కూడా మినీ వార్ జరిగింది.
అక్క తొక్క అంటూ అనామినేట్ చెయ్యొద్దు అని ఆని మాస్టర్ చెప్పగా.. విశ్వ కూడా బాగానే ఎటాక్ చేసాడు. ఇక సిరి - శ్వేతలు వాదించుకున్నారు. రవి ని మానస్ నామినేట్ చేసాడు. ఎప్పటిలాగే ప్రియా లోబో లు నామినేట్ చేసుకున్నారు. శ్రీరామ్ కెప్టెన్‌గా ఉండగా, ఒకవైపే మాట్లాడాడని సిరి అతడిని నామినేట్ చేసింది. హౌస్‌మేట్స్ గురించి శ్రీరామ్ మాట్లాడుతూ.. అవసరానికి తగ్గట్టు బంధాలను వాడుకోవద్దని చెబుతూ సిరిని నామినేట్ చేశాడు. షణ్ముఖ్ ని కూడా శ్రీరామ్ కడిగిపడేసాడు. ఇక సన్నీ ని ప్రియా కూడా నామినేట్ చెయ్యడం తో జెస్సి - షణ్ముఖ్ లు హ్యాపీ ఫీలయ్యారు. అయితే ఇక్కడ సిరి, జెస్సి, షణ్ముఖ్ లు మాత్రం ఓ గ్రూప్ గా ఫామ్ అయ్యి గేమ్ ఆడుతున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ లు అంటే పది మంది నామినేట్ అయ్యినట్టుగా బిగ్ బాస్ ప్రకటించారు.