యంగ్ టైగర్ పీఆర్వో, నిర్మాత మహేష్ కోనేరు మృతి చెందడం అందరిని షాక్ కి గురిచేసింది. ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్న మహేష్ కోనేరు ఎన్టీఆర్ పీఆర్వో గా పాపులర్ అయ్యారు... ఈ మధ్యనే మంచి కథలను ఎంచుకుని సినిమాలను నిర్మిస్తున్న మహేష్ కోనేరు సడన్ గా మృతి చెందడంతో అందరూ దిగ్బ్రాంతికి గురి అవుతున్నారు. మహేష్ కోనేరు ఈ ఉదయం విశాఖపట్నం లో గుండెపోటు తో మృతి అంటూ మీడియా లో బ్రేకింగ్ న్యూస్ చూసిన వారంతా షాకవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఆయన మృతి చెందడంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మహేష్ కోనేరు మృతికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.