టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎంత ఆసక్తిని రేకెత్తించాయి అనేది.. ఆదివారం జరిగిన గలాటా, మా ఎన్నికల కౌంటింగ్ అప్పుడు అందరూ వీక్షించారు. ప్రతి ఛానల్ పోటీ పడి మరీ మా ఎన్నికలను ప్రత్యక్ష ప్రసారం చేసాయి. మా ఎన్నికల్లో పోటీ పడిన ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు లలో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన తర్వాత అనూహ్యంగా ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ ఎక్కువమంది గెలిచిన.. మంచు విష్ణు అసలైన టార్గెట్ రీచ్ అయ్యాడు. అయితే మా ఎన్నికల కౌంటింగ్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థి అనసూయ లీడింగ్ లో ఉంది అని, అనసూయ గెలిచింది అంటూ ఆదివారం రాత్రి ఛానల్స్ లో న్యూస్ వచ్చేసింది.
దానితో అనసూయ సంబరాలు చేసుకుంది.. సోషల్ మీడియాలో అనసూయకి కంగ్రాట్స్ చెప్పేసారు. కానీ గెలిచిన జాబితాలో అనసూయ పేర లేకపోవడంతో షాకయినా అనసూయ కి అనుమానం మొదలయ్యింది. అసలేం జరిగింది. మా ఎన్నికల కౌంటింగ్ లో ఏదో మతలబు జరిగింది. రాత్రికి రాత్రే తేడా జరిగింది.. అంటూ సోషల్ మీడియాలో వరస ట్వీట్స్ తో అందరిలో అనుమానం కలిగేలా చేసింది. కేవలం 600 ఓట్లు లెక్కించడానికి రెండో రోజుకు కూడా వాయిదా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది తనకైతే అర్థం కావడం లేదంటూ ట్వీట్ చేసింది అనసూయ. మరి గెలిచింది అన్నాక అనసూయ ఓడిపోవడం అనేది అనసూయకే కాదు అందరిలో అనుమానం రేకెత్తించేలా ఉంది.