మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై గెలిచి మంచు విష్ణు మా అధ్యక్షుడయ్యాడు. అయితే ఈ మా ఎన్నికలు అన్నప్పటి నుండి ఈ ఎన్నికల మేటర్ మొత్తం మెగా ఫ్యామిలీ చుట్టూనే తిరిగింది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది అంటే నాకుంది అంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ లు ప్రకటించుకున్నాయి. నాగబాబు ఓపెన్ గానే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని చెప్పారు. ఇక చిరు - మోహన్ బాబులు మళ్ళీ స్నేహితులుగా మారుతున్నారు.. మెగా ఫ్యామిలీ సపోర్ట్ మంచు విష్ణు.. కూడా ఉండొచ్చు అనే అనుమానం ఉంది. ఎందుకంటే మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ లు నాకు మంచి ఫ్రెండ్స్ అన్నారు. ఫైనల్ గా మెగా ఫ్యామిలీ హీరోలైన చిరు - పవన్ - రామ్ చరణ్ లు మా ఎన్నికల్లో ఓటు వేశారు.
అయితే మెగా ఫ్యామిలీ ఓట్స్ నాకు వెయ్యలేదు.. అన్ని ప్రకాష్ రాజ్ కే పడ్డాయి అంటూ మంచు విష్ణు సంచలనంగా మాట్లాడాడు. ఎందుకంటే నేను పోటీ చేస్తున్నాను అనగానే చిరంజీవి గారు నాన్నగారికి ఫోన్ చేసి.. ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నాడు.. మంచు విష్ణు ని తప్పుకోమను అన్నారు. కానీ నాన్న గారు ఒప్పుకోలేదు. సరే ఎన్నికలకు వెళ్దామని నాన్న గారు అన్నారంటూ మంచు విష్ణు అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. అంతేకాదు.. తాను నాన్న గారి మాట జవదాటనట్టే.. రామ్ చరణ్ కూడా అయన తండ్రి చిరు మాట జవాడాడతాడు. సో అలా చరణ్ కూడా ప్రకాష్ రాజ్ కే ఓటు వేసి ఉండొచ్చు.. అందులో పెద్ద విశేషం ఏమి లేదు.
ఇక మా ఎన్నికల సభ్యత్వానికి రాజీనామాలు చేసే వారి ఇంటికి వెళ్లి మాట్లాడతాను.. ఎవరి రాజీనామా ఆమోదించే సమస్యే లేదంటూ మంచు విష్ణు.. నాగబాబు, ప్రకాష్ రాజ్ మా సభ్యత్వ రాజీనామాపై స్పందించారు.