రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. పూరి జగన్నాధ్ తో కలిసి పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసేందుకు ఎప్పుడెప్పుడు దిగుదామా అని ఎదురు చూస్తున్నాడు. కానీ లైగర్ మూవీ యూఎస్ షెడ్యూల్ లేట్ అవడం వలనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేకపోతున్నామంటూ ఫాన్స్ ని కాస్త డిస్పాయింట్ చేసాడు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ అంతా తిరుమల తిరుప్తి శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లారు. విజయ్ దేవరకొండ తల్లి, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ అందరూ తిరుపతి వెళ్లారు. నిన్న శ్రీవారి దర్శనం చేసుకున్న లైగర్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే సెలెబ్రటీస్ శ్రీవారి దర్శనానికి వెళతారు.. వస్తారు అందులో వింతేమీ లేదు. కానీ ఇక్కడ మాత్రం విజయ్ దేవరకొండ ప్రత్యేక ఫ్లయిట్ అంటే.. ప్రవేట్ జెట్ లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడమే హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా, రౌడీ బ్రాండ్స్ తో స్టార్ గా బాగా పాపులర్ అయ్యాడు. అలాగే బ్రాండ్స్ తోనూ బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్స్ మీద బాగా సంపాదిస్తున్నాడు. సో ఆలా మొన్న ఇల్లు కొన్నాడు.. ఇప్పుడు ఇలా తన ఫ్యామిలీ తో ప్రవేట్ జెట్ లో తిరుమల శ్రీవారి దర్శనానికి ఫస్ట్ టైం వెళ్లాడన్నమాట.