మంచు మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు ని మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిపించుకుని.. పరువు నిలబెట్టుకున్నారు. మంచు విష్ణు ని మా అధ్యక్షుడిని చేసేవరకు నిద్రపోలేదు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మీద గెలిచిన తర్వాత మా సభ్యులకి మోహన్ బాబు ఓ వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. అదేమిటంటే.. మా అధ్యక్షుడికి తెలియకుండా మీడియా తో ఎవరు మాట్లాడినా ఊరుకోము అని. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మా అధ్యక్షుడు ని డమ్మీని చేసి, మా సభ్యులు కొందరు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. ఆ తరవాత వాటిని కవర్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇకపై ఇలాంటి వి జరక్కుండా మోహన్ బాబు ముందే మా సభ్యులకి వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు అనుమతి లేకుండా ఎవరు కూడా మీడియా ముందుకు వెళ్లడానికి వీల్లేదంటూ అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మా ఆడపడుచులకు ఇది చెప్తున్నాను అంటూ మోహన్ బాబు వివరణ ఇవ్వడం చూస్తే.. మంచు విష్ణు ప్యానల్ లో ఎవరెవరు ఎక్సట్రాలు చేస్తారో.. వారికి సింపుల్ గా మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చి నోరు మూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి మోహన్ బాబు వార్నింగ్ ని మా సభ్యులు పాటిస్తారా అనేది వేచి చూడాలి.