Advertisementt

నాగ చైతన్య ఖచ్చితంగా స్పందించాల్సిందే

Mon 11th Oct 2021 08:13 PM
stylish preetham jukalker,breaks silence,samantha,naga chaitanya  నాగ చైతన్య ఖచ్చితంగా స్పందించాల్సిందే
Stylish Preetham Jukalker breaks silence నాగ చైతన్య ఖచ్చితంగా స్పందించాల్సిందే
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత విడిపోయాక.. సమంత పై ఎంతగా నెగెటివ్ ట్రోలింగ్ జరిగిందో.. అనేది సోషల్ మీడియాలో సమంత పై వచ్చిన వార్తలు, కథనాలు చూస్తే అర్ధమైంది. సమంత తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ వలనే అని, ప్రీతంతో సమంత క్లోజ్ గా ఉండడం వలనే అంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు.. సమంత తల్లి కావడం ఇష్టం లేదని.. సమంత సైడ్ నుండే తప్పు ఉంది అని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై సమంత సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదంటే.. సమంత ఫ్రెండ్ నీలిమ గుణ.. సమంత తల్లి కావాలనుకుంది అంటూ ఓ ఇంగ్లీష్ డైలీ ఇంటర్వ్యూలో చెప్పింది. 

ఇక తాజాగా ప్రీతమ్ జుకల్కర్ సమంత - నాగ చైతన్య విడాకుల విషయమై స్పందించాడు. అలాగే తనపై జరుగుతన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసాడు. సమంత కి ఎలాంటి సంబంధం లేదని, సమంత తనకి అక్కతో సమానం అని.. సమంత ని తాను జీజీ అని పిలుస్తాను అంటూ చెప్పడమే కాదు.. ఈ విషయమై నాగ చైతన్య స్పందించాలని, నాగ చైతన్య కొన్ని విషయాలు చెబితేనే.. ఇలాంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. నాగ చైతన్యకి నాకు ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది.. నాకు సామ్ కి మధ్యన ఉన్న సాన్నిహిత్యం చైతన్య కి తెలుసు.. చైతన్య స్పందిస్తేనే.. ఇలాంటి వదంతులు ఫాన్స్ వ్యాప్తి చెయ్యకుండా ఉంటారు. అయినా చైతు స్పందించకపోతే ఫాన్స్ నన్ను బెదిరిస్తున్నారు... సో చైతన్య ఈ విషయంపై స్పందించాల్సిందే అంటూ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

Stylish Preetham Jukalker breaks silence:

Stylish Preetham Jukalker breaks silence on the news of link up with Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ