మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు భారీ విజయాన్ని మూట గట్టుకున్నాడు. నటుడు ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలిచాడు. ప్రకాశ్ రాజ్ పై దాదాపు 107కి పైగా ఓట్ల భారీ మెజారిటీతో విష్ణు మా ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానెల్ లో ట్రెజరర్ గా శివబాలాజీ, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఈసీ మెంబర్లలోనూ విష్ణు ప్యానెల్ కు చెందిన 8 మంది విజయం సాధించారు. అటు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ విజయం సాధించాడు.
మరో వైస్ ప్రెసిడెంట్ గా విష్ణు ప్యానెల్ కు చెందిన మాదాల రవి గెలుపొందాడు. హోరాహోరీగా సాగిన ఈ మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. ఫైనల్ గా మంచు మోహన్ బాబు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ మా ఎన్నికల్లో మంచు కుటుంబానికే మా పీఠం దక్కింది. గత నెలరోజులుగా సినిమా థియేటర్స్ దగ్గర సందడి కన్నా.. టాలీవుడ్ లో మా ఎన్నికల సందడి ఎక్కువైంది. విమర్శలు, వివాదాలు నడుమ సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు తిరుగులేని విజయం పొందాడు.