గత మూడు నెలలుగా టాలీవుడ్ లో మా ఎన్నికల వేడి మాములుగా లేదు. ఓ నెల రోజుల నుండి మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ మధ్యన ఈ రోజు ఇప్పటివరకు హోరా హోరి యుద్ధ వాతావరణమే నడిచింది. మంచు విష్ణు ఫ్యామిలీ ని తిట్టడం, ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ ప్రచారం చెయ్యడం, మధ్యలో హేమ, జీవిత రాజశేఖర్ ల పంచాయితీ.. బండ్ల గణేష్ కామెంట్స్ అన్ని అంటే అన్ని మా ఎన్నికలని కాస్తా పొలిటికల్ ఎన్నికల టైప్ లో మార్చేసాయి. ఆఖరికి ఈ ఎన్నికల్లో ఫ్యామిలీలని కూడా లాగేసి.. ఏపీ సీఎం, టీఎస్ సీఎం కేసీఆర్ ని కూడా వాడేశారు.
ఇక ఈ రోజు ఉదయం నుండి జరిగిన మా ఎన్నికల్లో ఎంత గొడవైతే జరిగిందో.. మా ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి వచ్చిన సెలెబ్రిటీస్ సందడితో అక్కడ పండగ వాతావరణం కనబడింది. ఇక ఉదయం నుండి జరిగిన పోలింగ్ లో మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది ఆసక్తి కరంగా మారింది. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ లు చివరి వరకు నువ్వా - నేనా అని పోటీ పడ్డారు. ఫైనల్ గా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మా అధ్యక్షుడుగా మంచు విష్ణు గెలుపు ఖాయమైంది. ప్రకాష్ రాజ్ ముఖం వాడిపోయింది. మంచు విష్ణు గెలవడమే కాదు.. ఆయన ప్యానల్ లో చాలామంది సభ్యులని గెలుపు వరకు తీసుకెళ్లారు