Advertisementt

ప్రకాష్ రాజ్ - విష్ణు ఇద్దరూ బ్రదర్స్: బాలకృష్ణ

Sun 10th Oct 2021 12:20 PM
maa elections,balakrishna,prakash raj,manchu vishnu,balayya,chiru,ram charan,pawan,maa elections 2021  ప్రకాష్ రాజ్ -  విష్ణు ఇద్దరూ బ్రదర్స్: బాలకృష్ణ
Balakrishna on MAA elections ప్రకాష్ రాజ్ - విష్ణు ఇద్దరూ బ్రదర్స్: బాలకృష్ణ
Advertisement
Ads by CJ

గత నెల రోజులుగా టాలీవుడ్ లో మా ఎన్నికల హీటు మాములుగా లేదు. నువ్వా - నేనా అని కొట్టుకుంటున్న ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు లు.. బాలయ్య మద్దతు నాకుంది అని మంచు విష్ణు అంటే.. మెగా ఫ్యామిలీ మద్దతు నాకే అంటూ ప్రకాష్ రాజ్ లు పోటీ పడుతుంటే.. వీరిద్దరూ ఇండస్ట్రీకి ఎంతో అవసరం అని, వారిద్దరూ అన్నదమ్ముల్లాంటి వాళ్ళు అంటూ నందమూరి బాలకృష్ణ సంచలనం వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన బాలకృష్ణ ఓటు వేసిన తర్వాత మీడియా తో మాట్లాడుతూ. 

మా ఎన్నికల్లో ఎవరు బాగా పని చేస్తారో వాళ్లకే ఓటు వేశా. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు ప్యానెల్స్‌ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. మా ఎన్నికల్లో అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు, చేసేవాళ్లే. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. మా అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమం. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం అంటూ నందమూరి బాలకృష్ణ మా ఎన్నికలపై స్పందించారు.

Balakrishna on MAA elections:

MAA Elections: Balakrishna votes, turns diplomatic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ