Advertisementt

బాలయ్యకి గాయం- కంగారులో అభిమానులు

Sat 09th Oct 2021 07:55 PM
nandamuri balakrishna,balayya injured,shooting for talk show,aha talk show,balakrishna  బాలయ్యకి గాయం- కంగారులో అభిమానులు
Balakrishna injured during shooting బాలయ్యకి గాయం- కంగారులో అభిమానులు
Advertisement
Ads by CJ

బాలయ్యకి గాయం- కంగారులో అభిమానులు

బాలకృష్ణ రెండు రోజుల క్రితమే అఖండ షూటింగ్ ఫినిష్ చెయ్యడం... అఖండ వ్రాప్స్ అప్ పార్టీలో టీం తో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరి ఈలోపు బాలకృష్ణ కి గాయమైంది అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసిన ఆయన అభిమానులు.. నిన్ననే అఖండ షూటింగ్ పూర్తయ్యింది.. ఈలోపు మళ్ళీ బాలయ్య ఏ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.. ఏ షూటింగ్ లో బాలయ్యకి గాయమైంది అనే ఆందోళనలో ఉన్నారు. అయితే బాలకృష్ణ కి గాయమైంది.. ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ కోసం చేసిన ప్రోమో షూట్ లో.  బాలకృష్ణ ఓ టాక్ షో చేయబోతున్నారనే న్యూస్ ఉంది. ఆ టాక్ షో కి సంబందించిన ప్రోమో షూట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో క్రిష్ డైరెక్షన్ లో నిర్వహించారని తెలుస్తుంది.

ఆహా ఓటిటి టాక్ షో ప్రోమో షూట్ చేస్తుండగానే.. బాలకృష్ణ కాలికి గాయమైంది అని, అయినప్పటికీ బాలకృష్ణ గాయాన్ని కూడా లెక్క చెయ్యకుండా ఆ ప్రోమో షూట్ లో పాల్గొని చిత్రీకరణ కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక షూటింగ్ ఫినిష్ కాగానే.. బాలయ్య అక్కడినుండి నేరుగా హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకున్నట్టుగా సమాచారం. అయితే బాలయ్యకి గాయం అనగానే ఆయన అభిమానులు కాస్త కంగారు పడినా.. బాలయ్య కి కొద్దిపాటి గాయమే అయ్యింది అని.. ఫాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక బాలయ్య తో అల్లు అరవింద్ చేసే ఆహా టాక్ షో కి అన్‌స్టాపబుల్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా టాక్ ఉంది. ఇక బాలయ్య ఈ టాక్ షో కి సంబందించిన కొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసేసి.. గోపీచంద్ తో చెయ్యబోయే న్బక్౧౦౭  మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. 

Balakrishna injured during shooting:

Nandamuri Balakrishna injured during shooting for talk show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ