Advertisementt

బిగ్ బాస్ 5: నాగ్ క్లాస్ స్టార్ట్

Sat 09th Oct 2021 04:27 PM
bigg boss 5,nagarjuna,bigg boss 5 telugu,big boss,nag big boss  బిగ్ బాస్ 5: నాగ్ క్లాస్ స్టార్ట్
Bigg Boss 5: Nag Class start బిగ్ బాస్ 5: నాగ్ క్లాస్ స్టార్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 అయిదో వారం ముగిసి ఆరో వారంలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమా దేవి, లహరి, నటరాజ్ మాస్టర్ లు వెళ్లగా.. ఈ వారం కూడా తొమ్మిదిమంది నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం ప్రియా కొత్తగా కెప్టెన్ అవ్వగా.. వరెస్ట్ పెరఫార్మెర్ గా ఈ వీక్ కాజల్ జైలు కి వెళ్ళింది. ఇక ఈ రోజు నాగ్ ఎపిసోడ్ లో కొండ పొలం దర్శకుడు క్రిష్, హీరో వైష్ణవ్ తేజ్ తమ సినిమాని పబ్లిసిటీ చేసుకోవడంని బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు.  కొండపోలం సినిమా షూటింగ్ 40  రోజుల్లో పూర్తి చేశామని క్రిష్ చెబితే.. నాగ్ అయితే మా బిగ్ బాస్ హౌస్ మాత్రం 105 రోజులు అంటూ క్రిష్ తో చెప్పారు.

ఇంత చిన్న వయసులో రకుల్ ని ఎలా లవ్ చేసావ్ అని వైష్ణవ్ తేజ్ ని నాగ్ అడుగగా వైష్ణవ్ చెయ్యాల్సి వచ్చింది సర్ అన్నాడు. ఇక ప్రతి వారం శనివారం ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ కి నాగ్ క్లాస్ మొదలైంది. అయితే నాగ్ శ్రీరామ చంద్రాని బిగ్ బాస్ టైటిల్ అంటే ఇష్టమా? హమీదా అంటే ఇష్టమా? అని అడగగా.. నాకు బిగ్ బాస్ టైటిల్ అంటే ఇష్టం అని శ్రీరామ్ చెప్పడు. కానీ క్రిష్ నేనైతే.. హమీదా అంటే ఇష్టం అని చెప్పేవాడిని అని అన్నాడు. ఇక శ్రీరామ్ జెస్సిని తోసెయ్యడంపై, సిరి జెస్సికి సపోర్ట్ చేసి మాట్లాడడంపై నాగ్ ఈ వారం క్లాస్ తీసుకున్నట్లుగా లేటెస్ట్ గా వదిలిన ప్రోమో లో చూపించారు. 

Bigg Boss 5: Nag Class start:

Bigg Boss 5 Telugu New Promo Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ