ఈ రోజు శనివారం నాగార్జున.. బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసే రోజు. అదే రోజు కొంతమంది అంటే ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన సభ్యులు సేవ్ అయ్యే రోజు. అలాగే నాగార్జున తో తిట్లు తిట్టించుకునే రోజు కూడా ఇదే. అయితే ఈ వారం ఏకంగా 9 మంది నామినేషన్స్ లో ఉన్నారు. లోబో, వీజే సన్నీ, ప్రియ, యాంకర్ రవి, మానస్, విశ్వ, హమీదా, షణ్ముఖ్ జస్వంత్, జెస్సి లు ఉన్నారు. అయితే ఈ వారం నామినేట్ అయిన వారిలో స్ట్రాంగ్ గా ఓట్లు పడుతున్న కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్ జాస్వంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతనికి ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నామినేట్ అయిన దగ్గర నుండి ఓటింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో షణ్ముఖ్ ఉన్నాడు. తన తర్వాత ప్లేస్ లో సన్నీ రెండో స్థానంలో ఉన్నాడు.
ఐదో వారంలో నామినేట్ అయిన వారిలో పెద్దగా ఫేమ్ లేని సభ్యులే ఉన్నారు. దానితో బుల్లితెర ప్రేక్షకులు ఒక్కో రోజు ఒక్కొక్కరిని లేపుతున్నారు. రోజు రోజుకి ఈక్వేషన్స్ మారిపోయి ఓటింగ్ లో స్థానాలు మారిపోతున్నాయి. మానస్, రవి, ప్రియా, లోబో, జాస్వంత్ లు తర్వాత స్థానాల్లో ఉండగా.. ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నారంటున్నారు. అందులో సీరియల్ ఆర్టిస్ట్, కండల వీరుడు విశ్వ, ఎలాంటి ఫేమ్ లేని హమీదా లే చివరి స్థానాల్లో ఉన్నారని, వీరిద్దరిలో ఒకరు ఖచ్చితముగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని.. ముఖ్యంగా విశ్వ కె ఎక్కువ ఉంది అంటున్నారు. ఎందుకంటే హమీద ఈ మధ్యనే శ్రీరామ్ రామ్ చంద్ర తో లవ్ ట్రాక్ మొదలు పెట్టి గ్లామర్ గా హొయలు పోతుంది. సో హమీద గ్లామర్ పరంగా బిగ్ బాస్ సేవ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు.