Advertisementt

పూజ హెగ్డే ఫోన్ కాల్ కోసం వెయిటింగ్

Sat 09th Oct 2021 11:43 AM
pooja hegde,bhagat singh heroine,harish shankar,most eligible bachelor event  పూజ హెగ్డే ఫోన్ కాల్ కోసం వెయిటింగ్
Harish Shankar praises Pooja Hegde పూజ హెగ్డే ఫోన్ కాల్ కోసం వెయిటింగ్
Advertisement
Ads by CJ

గత రాత్రి హైదరాబాద్ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ఈ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసారు. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే నిజంగా బుట్టబొమ్మలా గ్లామర్ గా కనిపించింది. రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ వైట్ కలర్ డ్రెస్ లో దేవతలా కనిపించింది. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ పూజ హేగ్డ్ ని ఓ రేంజ్ లో పొగిడేసాడు. టాలీవుడ్ డీజే సినిమాతో పూజ కెరీర్ నే టర్న్ చేసిన హరీష్.. ఈ ఈవెంట్ లో పూజ హెగ్డే గురించి మట్లాడుతూ.. పూజ హేగ్డ్  ఇప్పుడు టాప్ హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్. 

మనందరం లాక్ డౌన్ అంటూ ఇంట్లోనే ఉన్నాం. కానీ పూజ హెగ్డే ఒక్క రోజు  కూడా ఖాళీగా లేదు. ఏ దర్శకుడైన హీరోయిన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తారు.. కానీ పూజ హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చెయ్యాల్సి వస్తుంది. ప్రెజెంట్ ఆమెతో మట్లాడాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అసలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈవెంట్ కి కూడా పూజ హెగ్డే వస్తుందా? రాదా? అని డౌట్ కూడా వచ్చింది. ఓ రెండు గంటల పాటు పూజ హెగ్డే ఏదైనా సినిమాకి వచ్చిందా అనిపించింది అంటూ పూజ హేగ్డ్ ని ఆకాశానికెత్తేసిన హరీష్ శంకర్.. పవన్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ అనే హింట్ కూడా ఇచ్చేసాడు. 

Harish Shankar praises Pooja Hegde:

Pooja Hegde is Bhagat Singh heroine: Harish Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ