Advertisementt

ప్రభాస్ పెళ్లి చేసుకోడా?

Sat 09th Oct 2021 11:08 AM
prabhas,prabha marriage,prabhas pan india movies,salaar,adipurush,radhe shyam,spirit,project k  ప్రభాస్ పెళ్లి చేసుకోడా?
Prabhas to explode double dhamakas ప్రభాస్ పెళ్లి చేసుకోడా?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దూకుడు మాములుగా లేదు.. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో అల్లాడిస్తున్నాడు. రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ప్రశాంత్ నీల్ తో సలార్, ఓం రౌత్ తో ఆదిపురుష్ షూటింగ్స్ చుట్టేస్తున్న ప్రభాస్.. నవంబర్ నుండి నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె షూట్ లో జాయిన్ కాబోతున్నాడు. వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ కి ఒక్క క్షణం తీరిక లేదు. అయినా ఇప్పుడు మరొకటి ఎనౌన్స్ చేసాడు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా తో స్పిరిట్ అంటూ పాన్ వరల్డ్ మూవీ ఎనిమిది భాషల్లో చెయ్యబోతున్నాడు. మరి ఈ ప్రోజెక్ట్స్ అన్నీ ఫినిష్ అవ్వడానికి మూడు నాలుగేళ్లయినా పడుతుంది.

అయినా ఇప్పడు ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్స్ ని ప్రకటించడానికి రెడీ అవ్వబోతున్నాడనే న్యూస్ ప్రభాస్ ఫాన్స్ కి కునుకురానియ్యడం లేదు. ప్రభాస్ వరస భారీ ప్రాజెక్ట్స్ చెయ్యడం ఓకె.. కానీ.. ఈ సినిమాలన్ని ఎప్పటికి పూర్తవ్వాలనేది సాధారణ ప్రేక్షకుడి ప్రశ్న. ప్రభాస్ తన తదుపరి మూవీ ని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సిద్దార్థ్ తోనూ, మరో ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టడమే కాదు.. త్వరలోనే అధికారిక ప్రకటన ఇప్పించబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాల వరకు ఓకె.. కానీ ప్రభాస్ పర్సనల్ గా అసలు సెటిల్ అయ్యే ఉద్దేశ్యం ఉందా? ఆసలు ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడు? పెళ్లి చేసుకోడా? బాలీవుడ్ సల్మాన్ ఖాన్ లా అలా ఉండిపోతాడా? అంటూ ఫాన్స్ బెంగ పెట్టుకుంటున్నారు. 

Prabhas to explode double dhamakas:

Many surprises await for fans on Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ