Advertisementt

బిగ్ బాస్ 5: ప్రియా కెప్టెన్ - కాజల్ మాత్రం

Sat 09th Oct 2021 10:33 AM
rj kajal,jail,bigg boss 5 telugu,bigg boss  బిగ్ బాస్ 5: ప్రియా కెప్టెన్ - కాజల్ మాత్రం
Bigg Boss 5: Priya Captain - Kajal? బిగ్ బాస్ 5: ప్రియా కెప్టెన్ - కాజల్ మాత్రం
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 5 హౌస్ లో ఐదో వారం లో బుల్లితెర ప్రేక్షకులకి కావాల్సినంత కంటెంట్ దొరికింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్, వరెస్ట్ పెరఫార్మెర్ ఎంచుకోవడంలో ఇంటి సభ్యులు నామినేషన్స్ అప్పుడు జరిగేంత గొడవ చేసారు. ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీని కోల్పోయిన ప్రియా అనూహ్యంగా బిగ్ బాస్ ఇచ్చిన బూస్ట్ తో ఇంటి సభ్యుల సహకారంతో కెప్టెన్ అయ్యింది. ఇక వరెస్ట్ పెరఫార్మెర్ గా అందరూ కాజల్ ని ఎన్నుకున్నారు. ఎక్కువగా కాజల్ ఆ తర్వాత శ్రీరామ చంద్ర, విశ్వాలని  వరేస్ట్ పెరఫార్మెర్ గా ఎంచుకున్నారు. దానితో కాజల్ ఫీలైపోతూ జైలుకెళ్లింది. కాజల్ హౌస్ మేట్స్ మీదున్న అభిప్రాయాలను బయట పెట్టడంతో ఆమెని వరెస్ట్ పెరఫార్మెర్ చేసారు. రవి అయితే కాజల్ వెన్నుపోటుని తట్టుకోలేకపోయాడు.

ఇక షన్ను విశ్వ మీద ఆయన అన్నమాటలు మీద విరుచుకుపడ్డాడు. ఇక్కడ కూడా షణ్ముఖ్, సిరి కలిస్ గేమ్ ఆడినట్లుగా విశ్వనే వరెస్ట్ పెరఫార్మెర్ అన్నారు. ఇక జెస్సి శ్రీరామ చంద్ర పై ఫైర్ అయ్యాడు. అయితే మానస్, సన్నీ లు స్మోక్ రూమ్ లో ఏడవడం ఈ ఎపిసోడ్ కి హైలెట్ అయ్యింది. అని మాస్టర్ విషయంలో సన్నీ బాగా ఏడ్చాడు. ఇక మానస్ ని కూడా లోబో ఊరుకోబెట్టడానికి ట్రై చేసాడు. వరెస్ట్ పెరఫార్మెర్ విషయంలో కాజల్‌పై ఉన్న కోపాన్ని అనీ మాస్టర్‌ తనపై చూపించుకుని, తన ముఖంపై తానే నీళ్లు కొట్టుకోవడంతో అందరూ షాకైపోయారు. ఇక ఈ రోజు నాగ్ ఎపిసోడ్.. తొమ్మిదిమంది నామినేషన్స్ లో మరి ఈ వారం ఎవరు సేవ్ అవుతారో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. 

Bigg Boss 5: Priya Captain - Kajal?:

RJ Kajal Set to Jail in Bigg Boss 5 Telugu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ