కరోనా అల్లకల్లోలంలో థియేటర్స్ మూతబడి సినిమా రిలీజ్ లు ఎక్కడిక్కడ ఆగిపోవడంతో నష్టాలపాలవుతున్న నిర్మాతలు కొందరు ఓటిటీలకి జై కొట్టి.. తమ సినిమాలను ఓటిటి ద్వారా రిలీజ్ చేసేసారు. దానితో సెకండ్ వేవ్ తగ్గి థియేటర్స్ ఓపెన్ అయినా.. కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకే అమ్మేసారు. హీరోలకి ఇష్టం లేకపోయినా.. మేకర్స్ నష్టపోకుండా హీరోలు కూడా కంప్రమైజ్ అయ్యారు. తాజాగా హీరోయిన్ శృతి హాసన్ ని ఓటిటి లేదా థియేటర్స్ లో మీరు దేనికి ప్రాధాన్యత నిస్తారు అనగా.. ఖచ్చితంగా థియేటర్స్ కే నా ఓటు. కొన్ని సినిమాలు థియేటర్స్ లోనే చూడాలి.. ఆ ఈలలు, గోల మధ్యనే సినిమాని ఎంజాయ్ చెయ్యాలి. ఇక ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి గోల లేకుండా మాత్రమే ఓటిటిలో సినిమా చూడాలి అని అంటుంది.
భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న ఫ్యామిలిలో పుట్టడం నా లక్కు అంటున్న శృతి హాసన్ సలార్ లాంటి పాన్ ఇండియా ఫిలిం లో నటించే అవకాశం రావడంతో నేను చాలా భాషల ప్రేక్షకుల దగ్గరవ్వబోతున్నాను.. ఆ సినిమా నన్ను చాలా భాషల ప్రేక్షకుల దగ్గరకు చేరుస్తుంది. చిన్నప్పటినుండి తమిళ్, హిందీ నేర్చుకున్నాను. ఇక పదేళ్ల క్రితం టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ తెలుగు నేర్చుకున్నాను.. సలార్ తో కన్నడ ప్రేక్షకులకు దగ్గరవ్వబోతున్నాను అంటూ శృతి హాసన్ సలార్ లో నటించాడం తన అదృష్టం అని, ప్రభాస్ తో వర్క్ చెయ్యడం బావుంది అని చెబుతుంది.