యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో జెమినీ ఛానల్ లో సోమవారం నుండి - గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 నిమిషాలకు ప్రసారం అవుతుంది. ఎన్టీఆర్ స్మైల్, ఎన్టీఆర్ స్టయిల్, ఎన్టీఆర్ ఆహార్యం, ఎన్టీఆర్ వఖ్చాతుర్యంతో ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఎన్టీఆర్ కంటెస్టెంట్స్ తో నడుచుకునే తీరు. వాళ్ళని ఆటపట్టించడం అన్ని బావున్నాయి కానీ షో కి ఆదరణ కరువయ్యింది. అందుకే మధ్య మధ్యలో ఈ షో కి బడా సెలబ్రిటీస్ ని గెస్ట్ లుగా తెస్తుంది జెమినీ యాజమాన్యం. ఓపినింగ్ ఎపిసోడ్ తోనే రామ్ చరణ్ ని తీసుకొచ్చిన షో నిర్వాహకులు తర్వాత కొరటాల, జక్కన్నలను తీసుకొచ్చి షో పై హైప్ క్రియేట్ చేసారు.
ఇక తర్వాత మహేష్ బాబు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి గెస్ట్ గా వచ్చాడంటూ పిక్స్ లీకయ్యాయి. ఇంకా జెమినీ వాళ్ళు కంఫర్మ్ చెయ్యలేదు. మహేష్ వస్తే షో కి టిఆర్పి పెరగడం ఖాయం. ఇక మహేష్ ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ షో కి గెస్ట్ గా సమంత వస్తుంది అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. ప్రస్తుతం భర్త చైతు తో విడిపోయిన సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సమంత శ్వాస తీసుకున్నా, ఊపిరి వదిలినా అది సెన్సేషన్ అవుతుంది. అలాంటి టైం లో సమంత ఎవరు మీలో కోటీశ్వరులు షో కి గెస్ట్ గా వస్తే.. షో కి మంచి టీఆర్పీ రావడం ఖాయమంటున్నారు.
మరి ఎన్టీఆర్ - సమంత కలిసి మూడు నాలుగు సినిమాలు చేసారు. బృందావనం, రభస, రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్ మూవీస్ లో కలిసి నటించారు. మరి బుల్లితెర మీద ఎన్టీఆర్ ఆడిస్తుంటే.. సమంత ఆడుతుంటే.. ఫాన్స్ కి పండగే.