బాలకృష్ణ అఖండ మూవీ షూటింగ్ పూర్తి చేసి గోపీచంద్ మలినేని మూవీ కోసం రెడీ అవుతున్నారు. అఖండ మూవీ రిలీజ్ డేట్ కోసం నందమూరి ఫాన్స్ వెయిటింగ్. మరోపక్క బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై కూడా ఫాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ హీరో అయ్యేందుకు రెడీ గా లేడనిపిస్తుంది. హీరో అవడానికి ఉండాల్సిన లక్షణాలు ఆయన దగ్గర కనిపించడం లేదు. హీరోగా పూర్తి స్థాయి జిమ్ బాడీ, ఫుల్ గా మేకోవర్ ఉండాలి. కానీ మోక్షజ్ఞ దగ్గర అవే మిస్సింగ్. ఆయన కనిపించిన ప్రతిసారి నందమూరి ఫాన్స్ కి డిస్పాయింట్. ఆయన వెయిట్ చూసి. బాగా బరువు పెరిగిన మోక్షజ్ఞ హీరో అవుదామనే విషయాన్ని పట్టించుకోవడం లేడనిపిస్తుంది.
2018 లోనే బాలయ్య తన కొడుకు తెరంగేట్రం గురించి మాట్లాడారు. ఇంకేంటి పూరి జగన్నాధ్ మోక్షజ్ఞ ని తెరకి పరిచయం చెయ్యబోతున్నాడంటూ ప్రచారము జరిగింది. బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. అది కూడా నా డైరెక్షన్ లోనే అంటారు. కానీ మోక్షజ్ఞ ఆలా సినిమాల్లోకి వచ్చేందుకు తయారుగా లేడు అనేది రీసెంట్ గా అఖండ షూటింగ్ స్పాట్ లో తన తల్లి వసుందర, బాలయ్య అఖండ గెటప్ లో ఉన్నప్పుడు మోక్షజ్ఞ దిగిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫ్రేమ్ లో తండ్రి పక్కన ఉన్న మోక్షజ్ఞ ని చూస్తే అమ్మో ఈయన ఇంకేం హీరో అవుతాడు అంటారు. అంత లావుగా.. బబ్లీ బబ్లీ గా కనిపిస్తున్నాడు. బాలయ్య అఖండ కీలకమైన షెడ్యూల్ లో ఉండగా మోక్షజ్ఞ ప్రత్యేకంగా తండ్రిని కలుసుకోవడానికి వచ్చాడు. అదే పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి మోక్షజ్ఞ అలా అవుట్ ఆఫ్ షేప్ లో ఉంటే.. హీరోగా పనికి రాడు.. బాలయ్యా నువ్వైనా మోక్షజ్ఞ పై కేర్ తీసుకోవయ్యా అంటూ నందమూరి ఫాన్స్ బాలయ్యా కి రిక్వెస్ట్ లు పెడుతూన్నారు.