మా ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. మా ఎన్నికలు కాస్తా పొలిటికల్ ఎన్నికల టైప్ లో ప్రత్యర్థుల మీద మాటల యుద్దానికి దిగుతున్నారు. మంచు విష్ణు ప్యానల్ - ప్రకాష్ రాజ్ ప్యానల్ మా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మా ఎన్నికలను పర్సనల్ గా మార్చేశారు. అసలు ఈ ఎన్నికల తర్వాత ఎవరు ఓడిపోయినా.. వారి పరువు పోయినట్లే అన్నట్టుగా ఫీలవుతున్నారు. 10 న జరగబోయే మా ఎన్నికల మేనిఫెస్టో ని విడుదల చేసింది మంచు విష్ణు ప్యానల్.
అందులో మా లో అర్హులు అయిన వారికి పక్కా ఇళ్ల దగ్గర నుండి, మా సభ్యుల్లో అర్హులైన వారికి కేజీ టు పీజీ వరకు విద్యా సాయం అంటూ మంచు విష్ణు తన మేనిఫెస్టోను విడుదల చేసారు.
1. మా సభ్యులందరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్
2. మూడు నెలలకి ఒకసారి మా సభ్యులకి మెడికల్ క్యాంప్ నిర్వహణ
3. మా సభ్యులకి గవర్నమెంట్ సహకారంతో శాశ్వత ఇల్లు
4. అందరూ గర్వపడేలా సొంత డబ్బుతో మా భవన నిర్మాణం
5. మా సభ్యత్వం ఉన్న వారికీ అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే మా యాప్ ద్వారా వారి వివరాలను దర్శకనిర్మాతలకు ఇస్తాం.
6. జాబ్ కమిటీ ద్వారా సినిమా, ఓటిటి అవకాశాలు కలిపిస్తాం
7. ఫండ్ రైసింగ్ కోసం కల్చరల్ అండ్ ఫైనాన్స్ కమిటీ ఏర్పాటు
8. మా అర్హులైన పిల్లలికి కేజీ టు పిజి ఉచిత విద్య
9. మా సభ్యత్వం ఉన్న వారి తమ పిల్లలకి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే.. మోహన్ బాబు ఇన్స్టిట్యూట్ ద్వారా 50 శాతం ఫిజుతో శిక్షణ
10. మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణ కోసం హైపవర్ కమిటీ
11. సీనియర్ సిటిజన్స్‌కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం
12. మా మెంబెర్ షిప్ కోసం వచ్చేవారికి కేవలం 75 వేలకే మా సభ్యత్వం
13. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లని కలిసి ఇండస్ట్రీ సమస్యలను తీర్చేందుకు కృషి
14. అర్హులైన కళాకారులకి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి