గతంలో జబర్దస్త్ స్టేజ్ మీద సాయి తేజ్ గా పరిచయం అయిన.. అబ్బాయి ఆ తర్వాత అమ్మాయిగా జెండర్ మార్చుకుని ప్రియంకాగా మారిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ 5 లో ప్రియాంక గా అడుగుపెట్టిన సాయి తేజ్.. అక్కడ తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. తన ఫస్ట్ లవ్ తనకి పిల్లలు పుట్టరని, నువ్వు ఎవరివో నీకు తెలుసా అంటూ హేళన చేసాడని చెప్పిన ప్రియాంక తాను అమ్మాయిగా మారిన విషయం తన ఫాదర్ కి తెలియదని ఆయనకి కళ్ళు కనిపించవని.. దగ్గరకి వెళ్లి టచ్ చెయ్యాలన్నా భయమే అని ప్రియంకాగా గతంలోనూ చెప్పింది బిగ్ బాస్ హౌస్ లోను చెప్పింది.
అయితే తాజాగా తాను అమ్మాయిగా మారిన విషయం వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేసేసారట. అదే వీడియో రూపంలో బిగ్ బాస్ చూపించారు. నాన్నా సాయి తేజ.. నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు మాకు ఒకటే. అమ్మాయిగా మారిన నిన్ను చూసి మెం ఏం అనుకోము, అనగానే ప్రియాంక చాలా ఎమోషనల్ అయ్యింది. మా సొంతింటికి కూడా దొంగల వెళతాను, బయటికి కూడా రాను. పక్కింటివాళ్ళకి కూడా తెలియదు నేను వచ్చినట్టుగా.. మా నాన్న నన్ను ఎక్సప్ట్ చేసి ఎప్పటిలాగే నువ్వు ఇంటికి రావొచ్చని చెబుతారని ఆశ పడ్డాను.. అంటూ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ నుండి పూలు, గాజులు, పట్టు సారీ అన్ని రాగా.. బిగ్ బాస్ అమ్మాయిలంతా ప్రియాంక చేతిలో పెట్టి రెడీ చేస్తున్న ప్రోమో వదిలారు. ఇక ప్రియాంక డాడీ ని పట్టుకుని ఒక్కసారి ఏడవాలని ఉంది.. డాడ్ ఐ లవ్ యు అంటూ కేకలు పెట్టింది. హౌస్ మేట్స్ అంతా ప్రియాంకని ఓదార్చారు.