టాలీవుడ్ లో మా ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ మధ్యన మా ఎన్నికల పోటీ పర్సనల్ గా మారిపోయింది. ఒకరి ఫ్యామిలీ మీద మరొకరు నోరు పారేసుకుంటున్నారు. మంచు విష్ణు మా మంచు ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను అంటే.. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు సినిమాల బడ్జెట్ విషయం మాట్లాడుతుంటారు. తాజాగా ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు అంటూ మెగా హీరో నాగబాబు ప్రకటించేసారు. మెగాస్టార్ చిరు మద్దతు ప్రకాష్ రాజ్ కి ఉంది అంటూ ప్రెస్ మీట్ పెట్టారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తరుపున మద్దతు ఇస్తున్నట్టుగా.. ఎప్పుడో ప్రకటించిన నాగబాబు కొన్నాళ్లుగా సైలెంట్ గానే ఉన్నారు.
తాజాగా నాగబాబు మళ్ళీ మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ వైపు మాట్లాడుతున్నారు. ప్రకాష్ రామ్ మా అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు పని చెయ్యాలి అని, ఆయన ఒక్కో సినిమాకి కోటి తీసుకునే దమ్మున్న నటుడు అని, మా కోసం అన్ని వదులుకున్నారని, ప్రకాశ్‌రాజ్ భారతీయ నటుడు. ఆయన తెలుగువాడు కాదని, విమర్శించే వాళ్లు తమ సినిమాల కోసం మాత్రం కావాలని పాకులాడుతారు. మన నటులు చాలామంది వేరే భాషల్లో చెయ్యడం లేదా.. ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్‌కు సేవ చేస్తానంటే వద్దంటారా.. మా ఎన్నికల్లో ఒక్కో ఓటుకు 10 చొప్పున వెళుతున్నాయి. ఇంకా ఎలక్షన్స్ తర్వాత మరింతగా ఇస్తామంటున్నారట. మా ప్రతిష్ట దిగజార్చవద్దు.. మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకాష్ రాజ్ కి ఉంటుంది.. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారి మద్దతు కూడా ప్రకాష్ రాజ్ కే అంటూ నాగబాకు ప్రెస్ మీట్ లో చెప్పేసారు.