బిగ్ బాస్ సీజన్ 5 లో ఐదో కెప్టెన్ అవ్వడం కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టారు. రవి, సన్నీ రాజులుగా.. తమ రాజ్యంలోని ప్రజలతో యుద్ధం చేస్తూ సపోర్ట్ ని కూడగట్టుకుంటో.. ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వారే కెప్టెన్సీకి అర్హత సాధిస్తారని చెబితే.. రవి తరపున శ్వేతా, విశ్వ, హమీద, శ్రీరామ్, ఆని మాస్టర్ లు ఉంటే..సన్నీ తరపున మానస్, షణ్ముఖ్, జెస్సి, ప్రియాంక ఉన్నారు. వీరిలో ఇద్దరు బురద ఫైట్ చెయ్యగా.. కాయిన్స్ దొంగతనంలో విశ్వ - మానస్ కొట్టేసుకున్నారు. ఇక ఈ రోజు రవి కి సపోర్ట్ చెయ్యాలో, సన్నీ కి సపోర్ట్ చెయ్యాలో అని సిరి కాజల్ మాట్లాడుకుంటారు. సిరి ని రవి నా దగ్గర నీ సీరియల్ యాక్టింగ్ చెయ్యకు అన్నాడు. రవి వచ్చి మానస్ దగ్గరకి సన్నీ గురించి నేను ఏమీ చెప్పను కానీ, నువ్వు కెప్టెన్ కావాలి అని చెప్పగా, నీ దగ్గరా ఫైర్ ఉంది.. ఆయన దగ్గరా ఫైర్ ఉంది. దాన్ని బయటకు తీయండి అన్నాడు మానస్.
మానస్ - కాజల్ కాయిన్స్ దొంగతనము చేసారు. రవి వచ్చి నేను చూసాను మీరు దొంగతనము చెయ్యడం అన్నాడు కాజల్ తో. ఇక ఫొటోల కోసం ఒకరినొకరు తోసుకుంటూ, బోర్డులు కింద పడేశారు. అక్కడ కార్డ్స్ పడెయ్యడంతో కెప్టెన్సీ టాస్క్ లో ఓ యుద్ధమే జరిగింది అని అర్ధమవుతుంది. ఎత్తి కింద పడెయ్యడం, తోసుకోవడం, గెంటేసుకోవడం, పడెయ్యడం అబ్బో ఈ టాస్క్ రభస, రచ్చ మాములుగా లేదు. మరి ఈ టాస్క్ లో ఎవరు విన్ అయ్యి కెప్టెన్ అయ్యారో కానీ.. మొత్తం గోల గోల అయినట్లుగా ప్రోమోలో చూపించారు.