పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కే చంద్ర మలయాళ హిట్ మూవీ అయ్యప్పమ్ కోషియమ్ మూవీ ని భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. అయితే రానా విషయంలో యాజిటీజ్ గా పృథ్వి రాజ్ లుక్ ని, ఈగో ని ఫాలో అయిన భీమ్లా నాయక్ టీం.. పవన్ కళ్యాణ్ విషయంలో బిజూ మీనన్ లుక్ ని తీసుకోలేదు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చిన్న హెయిర్ కట్ తో.. కాస్త రఫ్ లుక్ లో బిజూ మీనన్ కనిపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ గా స్టైలిష్ లుక్ లోనే కనిపిస్తున్నారు. మరోపక్క బిజూ మీనన్ వైఫ్ కేరెక్టర్ కూడా చాలా డీ గ్లామర్ గా చంటి బిడ్డని ఎత్తుకుని.. సింపుల్ గా కనిపిస్తుంది.
భీమ్లా నాయక్ పవన్ వైఫ్ గా నిత్యా మీనన్ నటిస్తుంది. నిత్య మీనన్ అసలు డీ గ్లామర్ గా కానీ, సింపుల్ గా కానీ కనిపించడం లేదు. క్లాసీ లుక్ లో చుడి దార్ వేసుకుని గ్లామర్ గా అందంగా కనిపిస్తుంది. మరి భీమ్లా నాయక్ లో పవన్ లుక్ స్టయిల్ లో ఎలాంటి మార్పులు లేనట్టు.. నిత్యా మీనన్ పాత్రని కూడా భారీ మార్పులు చేసారు. అయ్యప్పమ్ కోషియమ్ లో ఉన్న పాత్రల లుక్స్ వేరు.. భీమ్లా నాయక్ లో ఉన్న పాత్రల లుక్స్ వేరు. దీనిని బట్టి పవన్ కోసం అయ్యప్పమ్ కోషియమ్ మూవీని మొత్తం మార్చేశారనిపిస్తుంది. ఇప్పటికే పవన్ ని హైలెట్ చేస్తూ.. రానా ని తొక్కేస్తున్నారనే న్యూస్ కూడా ఉంది.