రేపు నాగ చైతన్య - సమంత వెడ్డింగ్ యానివర్సరీ. సామ్ - చై పెళ్ళై నాలుగేళ్లు పూర్తయ్యి ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టాల్సిన రోజు. కానీ అనూహ్యంగా నాగ చైతన్య - సమంత లు విడిపోయారు. విడాకులు సైతం తీసుకుంటున్నారు. క్యూట్ కపుల్ గా అందరికి ఆదర్శంగా నిలుస్తుంది అనుకున్న ఈ జంట ఇలా విడిపోవడం ఎవరికీ మింగుడుపడడం లేదు. వారిద్దరూ తాము విడిపోయామని ప్రకటినుంచి అప్పుడే నాలుగు రోజులు కావొస్తున్నా చాలామందికి ఈ న్యూస్ డైజెస్ట్ కావడం లేదు. పెళ్లికి ముందే బ్యాచులర్ పార్టీ అంటూ చై - సామ్ లు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసారు. పెళ్లి తర్వాత హాని మూన్ ట్రిప్ వేశారు. ఖాళీ సమయాల్లో మాల్దీవులు వెళ్లారు. కొద్ది సమయం దొరికినా సమంత - నాగ చైతన్య లు వెకేషన్స్ ప్లాన్ చేసుకునేవారు.
అయితే వీరు గనక విడిపోకపోతే వారి వెడ్డింగ్ యానివర్సరీ రోజున ఓ విదేశీ ట్రిప్ ఉండేది అని అంటున్నారు. సమంత కి ఎక్కువగా వెకేషన్స్ కి వెళ్లడం అలవాటు. అలాగే నాగ చైతన్య ని సమంత తీసుకుపోయేది. ఈ వెడ్డింగ్ యానివర్సరీ రోజున ఈ కపుల్ ప్లాన్స్ అన్ని ఓ రేంజ్ లో ఉండేవి. కానీ వీరిద్దరూ సపరేట్ అయ్యి అందరిని బాధపెడుతూ వారూ బాధపడుతున్నారు. ఇక నాగ చైతన్య కాస్త కూల్ గానే ఉన్నా.. సమంత మాత్రం కొద్దిగా ఉద్రేకానికి లోనవుతున్నట్టుగా కనిపిస్తుంది.. ఆమె వేసే ట్వీట్స్ చూస్తుంటే అదే అనిపిస్తుంది.