Advertisementt

బిగ్ బాస్ 5: షణ్ముఖ్ యాటిట్యూడ్

Wed 06th Oct 2021 11:52 AM
bigg boss 5,bigg boss 5 telugu,bigg boss,shanmukh jashwanth,siri,ravi  బిగ్ బాస్ 5: షణ్ముఖ్ యాటిట్యూడ్
Bigg Boss 5: Shanmukh Attitude బిగ్ బాస్ 5: షణ్ముఖ్ యాటిట్యూడ్
Advertisement
Ads by CJ

టైటిల్ ఫెవరెట్ గా బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ జాస్వంత్.. నాలుగు వారాలు పూర్తయినా తనలోని ప్రత్యేకతని మాత్రం చాటలేకపోతున్నాడు. వెబ్ సీరీస్, యూట్యూబ్ వీడియోస్ తో కోటికి పైగా అభిమానులని సంపాదించుకున్న షణ్ముఖ బిగ్ బాస్ లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. నాలుగు వారాలు గడిచిపోయినా.. షణ్ముఖ్ గేమ్ కనిపించడం లేదు. సిరి, జెస్సి లని వెంట తిప్పుకుంటూ.. అందరూ అంటున్నట్టుగా గ్రూప్ ఫామ్ చేసుకుని దాని నుండి బయటికి రాలేకపోయాడు. అంతేకాదు.. కాస్త యాటిట్యూడ్ చూపించడం కూడా ఎక్కువైంది. గత రాత్రి కెప్టెన్ శ్రీరామ చంద్ర తో ఫుడ్ విషయమై జెస్సి కోసం గొడవపడిన షణ్ముఖ్.. ఆ తర్వాత కూడా రియలైజ్ అవ్వలేదు. జెస్సి అబద్దం చెబుతున్నాడో లేదో కూడా తెలుసుకోలేకపోయాడు. 

ఇక బిగ్ బాస్ హౌస్ లోని అబ్బాయిలంతా నామినేట్ చెయ్యగా.. ఇప్పుడు చూపిస్తా నా ఆట అన్నోడు ఏం చూపిస్తాడో కానీ మరో కెప్టెన్సీ టాస్క్ లోను గ్రూపిజమే చేస్తున్నాడు. ఎలిమినేట్ ఐయాం కంటెస్టెంట్స్ అంతా షణ్ముఖ్ - సిరి కలిసి  ఆడుతున్నారనగానే సిరిని అవాయిడ్ చేసిన షణ్ముఖ్ నాగ్ చెప్పగానే దగ్గరయ్యారు. కానీ షణ్ముఖ్ మాత్రం బిగ్ బాస్ గేమ్ లో ఇప్పటికయినా యాక్టీవ్ గా లేకపతే ఆటను ఏదో ఒక వారం బయటికి వెళ్లాల్సిందే అంటున్నారు. టైటిల్ ఫెవరెట్ గా ఉన్న షన్ను.. కనీసం టాప్ 5 లో కూడా ఉండే ఛాన్స్ ఉండదు అంటున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా.. ఎలాగోలా.. కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే. షణ్ముఖ్ మాత్రం యాటిట్యూడ్ చూపెడుతున్నాడు.  

Bigg Boss 5: Shanmukh Attitude:

Bigg Boss 5 telugu update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ