Advertisementt

సమంత - చైతు విడిపోవడానికి అసలు కారణం

Tue 05th Oct 2021 10:25 PM
samantha,naga chaitanya,marriage,divorce,sam father,nagarjuna  సమంత - చైతు విడిపోవడానికి అసలు కారణం
Samantha-Naga Chaitanya Split: Reports Speculate Different సమంత - చైతు విడిపోవడానికి అసలు కారణం
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత ఐదేళ్లు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటైన క్యూట్ బ్యూటిఫుల్ కపుల్. నిజంగా వారికి మన దిష్టే తగులుతుందా అన్నట్టుగా నాగార్జున వాళ్ళ రిసెప్షన్ ని హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా చేసారు. పెళ్లి తర్వాత సమంత కెరీర్ లో దూసుకుపోయింది. వెకేషన్స్ లోనూ చైతు తో కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలు చూస్తే వాళ్ళు విడిపోయారు అనగానే అభిమానులే కాదు. కొన్ని కోట్ల హృదయాలు ముక్కలయ్యాయి. చైతు - సమంత విభేదాల కారణంగా విడిపోయారు. ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్, అక్కినేని ఫ్యామిలీ మాటలు పట్టించుకోకుండానే ఈ జంట విడిపోయింది. 

అయితే సమంత - నాగ చైతన్య విడిపోవడానికి అసలు కారణం సమంత తల్లి కావడం ఇష్టం లేక సరోగసీకి వెళ్లాలనుకోవడం, మరొకటి ఆమె ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో బోల్డ్ సీన్స్ చెయ్యడం, ఇంకొకటి ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సమంత ముంబై కి షిఫ్ట్ అవుదామని చైతు ని ఒత్తిడి చెయ్యడమే అంటున్నారు. తల్లిగా మారితే గ్లామర్ పోతుంది అని సమంత సరోగసి ద్వారా పిల్లలని కనాలనుకోవడం చైతూ కి ఇష్టం లేదని.. లో ప్రొఫైల్ మెయింటింగ్ చేసే చైతూకి సమంత సోషల్ మీడియా పిక్స్ వలన ఇబ్బంది కలగడం, అలాగే ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకి బాలీవుడ్ నుండి వస్తున్న బోల్డ్ కేరెక్టర్స్, అంతేకాకుండా ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ సమంతకి ముంబై లో ఇల్లు కొనిచ్చారనే న్యూస్ రావడంతో చైతు అప్ సెట్ అయ్యి తరుచూ వీరిమధ్యన గొడవలు తలెత్తడంతో.. ఇక ఇద్దరూ కలిసి జీవించలేకే విడిపోయారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇక సమంత - నాగ చైతన్య విడాకులు తీసుకోవడం పై నాగ్ దురదృష్టకరం.. వాళ్ళు బావుండాలి అంటే.. సమంత తండ్రి మాత్రం నా మైండ్ అంతా బ్లాంక్ గా ఉంది అంటూ స్పందించారు. 

Samantha-Naga Chaitanya Split: Reports Speculate Different :

Samantha and Naga Chaitanya end their marriage after four years

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ