Advertisementt

బిగ్ బాస్ 5: ఇప్పుడు చూస్తారు నా ఆట

Tue 05th Oct 2021 10:10 AM
bigg boss 5,bigg boss telugu,bigg boss season 5,shanmukh,siri,jessy,anchor ravi  బిగ్ బాస్ 5: ఇప్పుడు చూస్తారు నా ఆట
Bigg Boss 5 Yesterday Episode Highlights బిగ్ బాస్ 5: ఇప్పుడు చూస్తారు నా ఆట
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 లోకి క్రేజీ గా అడుగుపెట్టిన సోషల్ మీడియా కింగ్, యూట్యూబర్, వెబ్ సీరీస్ లతో కోటికి పైగా ఫాలోవర్స్ ని పెంచుకున్న షణ్ముఖ్ జాస్వంత్... హౌస్ లో మాత్రం ఆ క్రేజ్ చూపించలేకపోతున్నాడు. ఆఖరికి హోస్ట్ నాగార్జునే అరే ఏంట్రా ఇది అంటూ షణ్ముఖ్ ని అట పట్టిస్తున్నారు. మరోపక్క సిరి వలన షణ్ముఖ్ అక్కడక్కడ  హైలెట్ అవడం తప్ప.. ఎలాంటి ప్రత్యేకతని చూపించలేకపోతున్నాడు. ఇక జెస్సి ని మాత్రం తన మాట వినేలా చేసుకుని, సిరి ని తన చుట్టూ తిప్పుకుంటున్న.. షణ్ముఖ్ ని గత రాత్రి నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అబ్బాయిలందరూ నామినేట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి, జెస్సి తప్ప అందరూ షణ్ముఖ్ ని ఓ గ్రూప్ లా ఫామ్ అయ్యి గేమ్ ఆడుతున్నాడని, అసలు షణ్ముఖ్ ఎక్కడా కనిపించడం లేదంటూ నామినేట్ చేసారు.

దానితో బిగ్ బాస్ షణ్ముఖ్ నిన్ను నామినేట్ చేసిన వారు వీళ్ళే అంటూ పేర్లు చెప్పగా.. అబ్బ ఇది కదా కావాల్సింది.. ఇప్పటివరకు ఆడలేదు అంటున్నారుగా.. ఇక ఇప్పుడు చూస్తారు నా ఆట అంటూ జెస్సి, సిరి ల దగ్గర కాస్త ఓవేరేక్షన్ చేసాడు. ఆ తర్వాత ఫుడ్ దగ్గర జెస్సి కెప్టెన్ శ్రీరామ్ తో గొడవ పడుతుంటే.. మధ్యలో వెళ్లి కాస్త గొడవ చేసాడు షణ్ముఖ్. జెస్సి తో కలిసి ఫుడ్ తినకుండా కూర్చుంటే.. శ్రీరామ్ వచ్చి వారికి ఫుడ్ ఇచ్చాడు. అయినా షణ్ముఖ్ కాస్త యాటిట్యూడ్ చూపించాడు. ఇక ఈ రోజు కూడా అదే గొడవ కంటిన్యూ అయినట్లుగా బిగ్ బాస్ చూపించాడు. ఈ రోజు గొడవలో నీకు సంబంధం లేని గొడవకు నువ్వు రావొద్దు అని శ్రీరామ్ అంటే.. నా ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకుంటాను అంటూ షణ్ముఖ్ శ్రీరామ్ తో గొడవ పడుతున్నాడు. ఇక యాంకర్ రవి సిరి, షణ్ముఖ్, జెస్సి ఎవరితో కలవకుండా ముత్తైదువుల్లా కూర్చుని గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటున్నాడు. 

Bigg Boss 5 Yesterday Episode Highlights :

Bigg Boss 5 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ