ఇప్పుడు అందరూ రాజమౌళి మీద కోపం వస్తున్నా కక్కలేక మింగలేక ఉన్నారు. అసలే ఆర్.ఆర్.ఆర్ మూవీ పాన్ ఇండియా మూవీ కావడం.. అది అన్ని భాషల మర్కెట్స్ పై ప్రభావం చూపుతుంది కాబట్టి. రాజమౌళి అంటే ఓ క్రేజ్, ఓ బ్రాండ్ అందుకే పలు భాషల హీరోలు రాజమౌళి పై కోపం వస్తున్నా కామ్ గా ఉన్నారు. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ ని జనవరి 7 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా రాజమౌళి బాంబు పేల్చడంతో.. అందరూ ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నారు. రాజమౌళి డేట్ ఇవ్వగానే.. తెలుగులో బాక్సాఫీసు ఫైట్ కి రెడీ అయిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ - మహేష్ సర్కారు వారి పాట హీరోలు వారి అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సంక్రాంతి క్రేజ్ తో సినిమాలకి కలెక్షన్స్ వస్తాయనుకుంటే.. ఆర్.ఆర్.ఆర్ అడ్డు పడింది. మరోపక్క తమిళ్ లో పొంగల్ సినిమాలకి ఆర్.ఆర్.ఆర్ గండం. ఇక హిందీ మర్కెట్ పై ఆర్.ఆర్.ఆర్ ప్రభావం మాములుగా ఉండదు.
మరి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యాక ఒక్క వారినికే చాలా సినిమాలు అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతాయి. అంటే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి ఒకే ఒక్క వారం కలెక్షన్స్ సరిపోతాయా.. వరల్డ్ వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ అవుతుంది. ఓ 15 రోజుల సందడి ఉండాల్సిందే. కానీ రాజమౌళి ఒక్క వారం చాలనుకుంటున్నారా? అందుకే అలా డేట్ జనవరి 7 న ఫిక్స్ చేసారా? లేదంటే ఇతర సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా మన సినిమాకి సంక్రాంతి హాలిడేస్ కలిసొస్తాయని అనుకుంటున్నారా? టాలీవుడ్ నుండే మహేష్, పవన్ వస్తుంటే.. పాన్ ఇండియా ఫిలిం ప్రభాస్ రాధేశ్యామ్ సంక్రాంతికే రిలీజ్ అవుతుంది. మరోపక్క తమిళ్ లో అజిత్ వాలిమై, హిందీలో ఇంకెన్ని సినిమాలు ఆ టైం కి సెట్ అవుతాయో.. మరి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి సూపర్ హిట్ టాక్ పడితే ఏ హీరో ఏం చెయ్యలేడు. కానీ టాక్ అటు ఇటు అయితేనే కష్టం.