చిరంజీవి - రామ్ చరణ్ కలయికలో మల్టీస్టారర్ మూవీ గా తెరకెక్కుతున్న ఆచార్య మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్, అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీస్ డేట్స్ వచ్చేసాయి కానీ.. ఆచార్య డేట్ మాత్రం ఇవ్వడం లేదు అంటూ మెగా ఫాన్స్ అలుగుతున్నారు. ఆచార్య షూటింగ్ కంప్లీట్ అయ్యి సాంగ్స్ షూట్ చేస్తున్న కొరటాల ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్స్ లో బిజీగా వున్నారు. మరోపక్క చిరు గాడ్ ఫాదర్ షూటింగ్ తో బిజీగా మారితే, రామ్ చరణ్ త్వరలోనే RC15 షూటింగ్ కి రెడీ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకున్నా చిరు ఆచార్య డేట్ పట్టించుకోవడం లేదంటున్నారు.
ఆచార్య ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆచార్య డేట్ సూన్, కాదు ఆచార్య డేట్ ని డిసెంబర్ 17 కి ఇచ్చేస్తున్నారు. పుష్ప మీద ఫైట్ కి రాబోతున్న ఆచార్య, చిరు vs అల్లు అర్జున్, మేనల్లుడి మీదకి సై అంటున్న మెగాస్టార్, ఆచార్య డేట్ డిసెంబర్ 17 నే ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ హంగామా చేస్తున్నారు. మరోపక్క సంక్రాంతికి కూడా ఆచార్య డేట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు. భారీ అంచనాలే ఉన్న ఆచార్య మూవీ డేట్ ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని ఫాన్స్ మేకర్స్ ని ఒత్తిడి చేస్తున్నారు. మరి ఆ డేట్ ఏదో ప్రకటిస్తే.. ఫాన్స్ శాంతిస్తారు.. లేదంటే..