అక్కినేని ఫ్యామిలీ లో భారీ కుదుపు. అక్కినేని వారసుడు నాగ చైతన్య భర్య సమంత తో విడాకులు తీసుకున్నాడు. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య టాప్ హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమలో ఐదేళ్లు, పెళ్లి తర్వాత నాలుగేళ్లు వారి వివాహ బంధం గిల్లి కజ్జాలతో సాఫీగానే సాగిపోయింది. కానీ అనుకోకుండా వారి మధ్యన వివాదాలు తలెత్తడంతో.. కోర్టు జోక్యం, అక్కినేని ఫ్యామిలీ మందలింపు కూడా లెక్కచెయ్యకుండా.. ఇద్దరూ విడిపోతున్నట్లుగా ప్రకటించారు. ఈ విడాకుల విషయంలో మొదటి నుండి నాగ చైతన్య మౌనంగానే ఉన్నాడు. సమంతానే చైతు తో విడిపోతున్నాను అనుకున్నాక.. సోషల్ మీడియాలో అర్ధం పర్ధం లేని ట్వీట్స్ పెట్టడం, తన పేరుని మార్చేసుకోవడం చేస్తుంది. ఇక అఫీషియల్ గా విడిపోయామన్నాక కూడా సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంది.
తాజాగా కూడా సమంత విడాకుల మేటర్ తర్వాత ఆ విషయమై స్పందిస్తూ ప్రపంచాన్ని గెలవాలంటే.. ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి.. ప్రస్తుతం కెరీర్ మీద దృష్టి పెట్టి.. పని చెయ్యాలి.. బద్ధకం వదిలెయ్యాలి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఇలా సమంత విడాకుల మేటర్ లో తరుచూ ఏదో ఒక పోస్ట్ తో హైలెట్ అయినా.. నాగ చైతన్య మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఆఖరికి లవ్ స్టోరీ ప్రమోషన్స్ లోను తన పర్సనల్ విషయాలు మీడియా దగ్గర బయట పడకుండా జాగ్రత్త పడ్డాడు.
ఇక చైతూ - సమంత విడిపోవడానికి సవాలక్ష కారణాలు మీడియాలో వినిపిస్తున్నాయి. కర్ణుడు చావుకి కారణం చెప్పలేకపోయినట్లు.. వీరు విడాకులు ఎందుకు తీసుకున్నారో తెలియక నెటిజెన్స్ రకరకాల కారణాలను వారి విడాకుల మేటర్ విషయంలో దూరుస్తున్నారు.