Advertisementt

ఆరడుగుల బుల్లెట్ ట్రైల‌ర్ టాక్

Mon 04th Oct 2021 02:56 PM
aaradugula bullet,aaradugula bullet movie trailer,gopichand,nayantara  ఆరడుగుల బుల్లెట్ ట్రైల‌ర్ టాక్
Aaradugula Bullet trailer talk ఆరడుగుల బుల్లెట్ ట్రైల‌ర్ టాక్
Advertisement

గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. అక్టోబర్ 8న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

పేరు శివ.. పుట్టింది బెజవాడ.. పెరిగింది హైదరాబాద్.. పరిచయమైతే నేను మర్చిపోను.. పంగా అయితే నువ్వు మర్చిపోలేవ్ అని గోపీచంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. పనీ పాటా లేకుండా తిరుగుతూ తండ్రితో తిట్లు తినే కుర్రాడిగా హీరో క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేశారు. గోపీచంద్ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించారు. పోషించలేని వాడికి ప్రేమ ఎందుకు? పడి తినే వాడికి పౌరుషం ఎందుకు? అంటూ తిడుతుంటాడు. అవేమీ పట్టించుకోని గోపీచంద్ ఎంతో ఉల్లాసంగా ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే విలన్ అభిమన్యు సింగ్ వల్ల తన తండ్రికి సమస్య ఎదురవడంతో గోపీచంద్ క్యారక్టర్ మరో టర్న్ తీసుకుంది. తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లే కొడుకు విలన్స్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఏమేమి చేసాడు అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. బి గోపాల్ గత చిత్రాల తరహాలోనే ఆరడుగుల బుల్లెట్ని కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. నయన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. బాల మురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేశారు.

Aaradugula Bullet trailer talk:

Aaradugula Bullet trailer release

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement