Advertisementt

ఐదో వారం బిగ్ బాస్ నామినేషన్స్ లీక్

Mon 04th Oct 2021 01:46 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss 5 nominations,nagarjuna  ఐదో వారం బిగ్ బాస్ నామినేషన్స్ లీక్
Fifth Week Bigg Boss 5 Nominations Leak ఐదో వారం బిగ్ బాస్ నామినేషన్స్ లీక్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి, తాజాగా నటరాజ్ మాస్టర్స్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా చాలా హాట్ గానే సాగింది. ప్రతి సోమవారం ఇంటి సభ్యులు ఇద్దరిని నామినేట్ చేస్తూ దానికి తగిన కారణాలు చెబుతూ ఫైర్ అవుతున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ అయితే సహనం కోల్పోయి.. ఇతర కంటెస్టెంట్స్ పై విరుచుకుపడుతున్నారు. గత వారం వాడిగా వేడిగా సాగిన నామినేషన్స్ ప్రక్రియ.. ఈ వారం కూల్ గానే ప్రత్యేకమైన గదిలో జరిగింది. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ దానికి తగిన కారణాలు బిగ్ బాస్ కి చెప్పాలి.

విజె సన్నీ ఈ నామినేషన్స్ ని సీక్రెట్ రూమ్ లో ఇవ్వకపోయినా.. ఓపెన్ గానే నేను వాళ్ళ ఇద్దరి పేర్లు చెప్పేవాడిని అనగా.. కాజల్ ఇది నా స్ట్రాటజీ, నన్ను నానిమినేట్ చేసిన వాళ్ళని నేనూ నామినేట్ చేస్తా అంది. ఇక శ్రీరామ చంద్ర షణ్ముఖ్ - సిరి - జెస్సి లు గ్రూపిజం చేస్తున్నారన్నారు. ప్రియా అయితే సన్నీ నన్నే టార్గెట్ చేస్తున్నాడు అంది. లోబో నన్ను కోపంగా చూపించకపోతే షన్ను ఎవరిని నామినేట్ చేసేవాడో చెప్పవాడిని అన్నాడు. షన్ను విశ్వ హౌస్ లోకి వచ్చినప్పటికీ.. ఇప్పటికి చాలా తేడాగా కనిపిస్తున్నాడన్నాడు. విశ్వ ఇంకాస్త బరస్ట్ అయ్యాడు. ఇక సిరి షన్ను చెవిలో గుసగుసలాడగానే బిగ్ బాస్ షన్ను - సిరి - జెస్సిలని హెచ్చరించాడు.

ఫైనల్ గా ఈవారం ఏకంగా 9 మంది నామినేషన్స్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. హమీదా, షణ్ముఖ్, వీజే సన్నీ, జస్వంత్, యాంకర్ రవి, మానస్, విశ్వ, లోబో, ప్రియ నామినేట్ అవ్వగా.. మిగతా వారు సేఫ్ జోన్ లో ఉన్నారు. 

Fifth Week Bigg Boss 5 Nominations Leak:

Bigg Boss 5 Telugu Nominations This Week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ