Advertisementt

మంచు విష్ణు బ్లెస్సింగ్స్ - ప్రకాష్ రాజ్ ఫైర్

Mon 04th Oct 2021 01:21 PM
maa elections,manchu vishnu,prakash raj,manchu vishnu vs prakash raj  మంచు విష్ణు బ్లెస్సింగ్స్ - ప్రకాష్ రాజ్ ఫైర్
Manchu Vishnu Blessings - Prakash Raj Fire మంచు విష్ణు బ్లెస్సింగ్స్ - ప్రకాష్ రాజ్ ఫైర్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో మా ఎన్నికల వేడి మరింతగా ఎక్కువైంది. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్యన ఫైట్ మామూలుగా లేదు. మంచు విష్ణు ఇండస్ట్రీలోని పెద్దల చుట్టూ సపోర్ట్ కోసం తిరుగుతున్నాడు. ప్రకాష్ రాజ్ మాటల తూటాలతో మా ఎన్నికలలో కాక పుట్టిస్తున్నారు.. ప్రకాష్ రాజ్ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ పై ఫైర్ అవుతున్నారు. తనది వేరే రాష్ట్రం అయినా.. తాను తెలుగు స్పష్టంగా మాట్లాడగలను అని, టాలీవుడ్ తనకి అన్ని ఇచ్చింది అని, మంచు విష్ణు ప్యానల్ సభ్యులెవరు తనలా తెలుగు స్పష్టంగా మాట్లాడలేరని.. నరేష్ మట్లాడేముందు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఫైర్ అయ్యారు. 

అంతేకాదు.. ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా.. సాయాలు, చందాలు, ఉచితాలతోనే బ్రతుకుదామా ??? ఆల్ లైట్స్, యాక్షన్ లతో పనిచేస్తూ జీవిద్దామా..?? అడుగు, ఆలోచన, ఆచరణ... మా కోసం, మా సభ్యుడి క్షేమంకోసం అంటూ పవర్ ఫుల్ గా మెసేజ్ ఇచ్చారు.

ఇక మంచు విష్ణు రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ సపోర్ట్ కోసం తండ్రి మోహన్ బాబు తో కలిసి వెళ్లి కృష్ణ గారి బ్లెస్సింగ్స్ తీసుకోగా.. నిన్న బాలకృష్ణ ని కలిసి ఆయన సపోర్ట్ ని కూడగట్టుకున్నాడు. ఇక తాజాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి ఇంటికి వెళ్లి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నట్లుగా ట్వీట్ చేసాడు మంచు విష్ణు. ఓ పక్క మా ఎన్నికల్లో పెద్దల సపోర్ట్ తీసుకుంటూనే.. వారి బ్లెస్సింగ్స్ పొందుతున్న మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ ల మధ్యన ఎలాంటి ఫైట్ ఉండబోతుంది.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనేది అక్టోబర్ 10 న తేలిపోతుంది. 

Manchu Vishnu Blessings - Prakash Raj Fire:

Manchu Vishnu vs Prakash Raj 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ