మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీ సమస్యలను నెత్తిన వేసుకుని.. వాటి పరిష్కారం కోసం తన బ్యాచ్ తో రెండు రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు తిరగడమే కాకుండా.. చిరు కరోనా టైం లో చారిటి స్థాపించి.. ఇండస్ట్రీలోని పేదవారికి సహాయం అందించడం దగ్గరనుండి.. ఇండస్ట్రీలోని చిన్న హీరోలను ప్రోత్సహిస్తూ ఇండస్ట్రీ పెద్దగానే వ్యవహరిస్తున్నారు. కానీ ఆయనెప్పుడూ నేనే ఇండస్ట్రీ పెద్దని అని చెప్పుకోలేదు. తాజాగా ఇండస్ట్రీకి పెద్ద వారు అనేవారు లేరు.. దాసరి నారాయణరావు గారు తర్వాత ఆ ప్లేస్ ఖాళీగానే ఉంది.. చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అంటే ఒప్పుకొను అంటూ మంచు మోహన్ బాబు రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చెప్పారు.
చిరంజీవి తనకి మంచి స్నేహితుడే.. ఇప్పుడు నేను ఫోన్ చేసినా తీస్తారు. కానీ ఆయన పెద్ద అంటే ఒప్పుకోను అని అన్నారు. ఇక మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి తీరుతాడని, తాను 700 ఫోన్ కాల్స్ చేసి మా సబ్యులకు విష్ణు గెలిస్తే ఏం చేస్తాడో చెప్పా అని, విష్ణు కూడా 500 మందికి పైగా ఫోన్ చేసాడు అని.. ఈ ఎన్నికల్లో విష్ణు నే గెలుస్తాడని చెబుతున్నారు. గెలవకపోవడం అనేది ఇక్కడ జరగదని.. బాలయ్య బాబు, కృష్ణ గారి సపోర్ట్ ఉంది అని, చెప్పిన మోహన్ బాబు ని ఆర్కే ఓ ప్రశ్న అడిగారు. కృష్ణ గారి మద్దతు కోసం ఆయన ఇంటికి వెళ్ళారా అంటే.. కాదు ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాం. అలాగే బాలయ్యని విష్ణు కలుస్తాను అంటే వెళ్ళమన్నా. ఇక విష్ణు పోటీకి దిగడమే వెంకీ, చిరు, బాలయ్య, నాగ్ లకి ఫోన్ చెయ్యమని చెప్పాను అని మోహన్ బాబు చెప్పగా..
ఆర్కే మరి చిరు ఆశీర్వాదం కోసం ఎందుకు వెళ్ళలేదు.. ఆయన ఆశీర్వాదం అక్కర్లేదనా అని అడిగారు.. అలాగే చిరు తో ఇప్పుడిప్పుడే మొగ్గ తొడుగుతున్న స్నేహం మళ్లీ.. పోయి శత్రుత్వం స్టార్ట్ అయ్యింది అని అనుకోవాలా అని అడిగిన ప్రశ్నకి.. అది చెప్పలేను అనగానే ఆర్కే.. మౌనం అర్ధాంగీకారం అని మీరు సినిమాలో చెప్పిన డైలాగ్ కే ఫిక్స్ అవుతాను అంటూ షాకిచ్చారు.