గత రాత్రి ముంబై లోని క్రూయిజ్ రేవ్ పార్టీలో స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకుంటూ ఎన్సీబీ అధికారులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్.. ని ఎన్సీబీ అధికారులు ఏకంగా 18 గంటలపాటు ప్రశిస్తూనే ఉన్నారు. ముంబై లో ఐదు చోట్ల ఎన్సీబీ డ్రగ్స్ ముఠాలపై దాడి చెయ్యగా.. ఓ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సేవిస్తూ స్నేహితులతో పాటుగా పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఇక గత కొన్ని గంటలుగా ఆర్యన్ ఖాన్ ని విచారణ చేసిన ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ ఫోన్ సీజ్ చేసి.. ఆయన వాట్స్ యాప్ ని పరిశీలించగా.. డ్రగ్స్ పెడ్లర్స్ తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి పలుసార్లు చాట్ చేసినట్లుగా చెబుతున్నారు.
ఇక విచారణ అంతరం షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసినట్లుగా ఎన్సీబీ అధికారులు ప్రకటించారు. ఆర్యన్ ఖాన్ తో పాటుగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఓ 8 మందిని గత రాత్రి నుండే అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ జరిపి ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ ఫోన్ లో ఉన్న కీలక ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు అధికారులు. యూనివర్శిటి ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ నుంచి ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్, ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని సొంతం చేసుకున్న ఆర్యాన్ ఖాన్ ఇంకా వెండితెరకి పరిచయం కాకుండానే ఇలాంటి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో షారుఖ్ మధనపడుతున్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.