మా ఎన్నికల్లో బాలయ్య అన్న సపోర్ట్ నాకే అంటున్నాడు మంచు విష్ణు. నటుడు ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మా ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి పోటీ చేస్తున్నారు. జీవిత, హేమ, నరసింహారావు లాంటి వారు పోటీకి సై అన్నా.. చివరికి వారంతా విత్ డ్రా చేసుకోగా.. ఫైనల్ వార్ మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ మధ్యనే మిగిలింది. మంచు విష్ణు ఇండస్ట్రీ లోని పెద్దల సపోర్ట్ కోసం తిరుగుతుంటే.. ప్రకాష్ రాజ్ ఛానల్స్ లైవ్ లో మా అధ్యక్షుడు అయితే తనేం చేస్తానో అనేది ప్రచారం చేస్తున్నారు. ఇక మా అధ్యక్ష పీఠానికి నామినేషన్స్ వేసినప్పుడే మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ లు నువ్వా - నేనా అని మాటల యుద్దానికి దిగారు.
ఇక మంచు విష్ణు రెండు రోజుల క్రితం తన తండ్రి మోహన్ బాబు ని తీసుకుని సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లి సపోర్ట్ కావాలని అడిగాడు. తాజాగా బాలకృష్ణ వద్దకి వెళ్ళిన మంచు విష్ణు బాలయ్య బాబు తో కలిసి ఫొటోలకి ఫోజిలివ్వడమే కాదు.. ఈ MAA ఎన్నికలలో నన్నుఆశీర్వదించిన మరియు మద్దతు ఇచ్చిన ఏకైక వ్యక్తి నటసింహం, బాల అన్నకు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు లభించడం నా గౌరవం అంటూ మంచు విష్ణు ట్వీట్ చేసాడు. మంచు విష్ణు - బాలయ్య కలిసి దిగిన ఫొటోస్ చూస్తే పక్కాగా బాలయ్య మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నట్టే కనిపించింది.