నాగ చైతన్య - సమంత విడాకుల వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ ని తాకింది. చైతు - సామ్ గత కొంతకాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటూ.. నిన్న శనివారం వారి విడాకులు, తాము విడిపోతున్న విషయం సామజిక మద్యమాల ద్వారా అందరికి షేర్ చేసారు. దానితో ఆర్జీవీ చై - సామ్ విడాకులపై స్పందిస్తూ పెళ్లి అనేది డెత్ తో సమానం, విడాకులు అనేది పునర్జన్మతో సమానం అంటూ ట్వీట్ వెయ్యగా.. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ అయితే ఏకంగా చై - సామ్ విడాకుల మేటర్ లోకి ఓ బాలీవుడ్ స్టార్ హీరోని లాగేసింది.
రీసెంట్ గా టాలీవుడ్ హీరో ఒకరు విడాకులు తీసుకున్నారు.. తమ నాలుగేళ్ళ బంధానికి ముగింపు ఇస్తూ భర్యకి విడాకులు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. పెళ్ళికి ముందే ఆయన భార్య తో కొన్నేళ్లు ప్రేమతో ఉన్నాడు. అయితే ఈ మధ్యనే బాలీవుడ్ లో విడాకుల స్పెషలిస్ట్ అయిన సూపర్ స్టార్ ని కలిశారు. ఆయన మార్గంలోనే టాలీవుడ్ నటుడు కూడా నడుస్తున్నాడు. ఆయన దారిలోనే నడుస్తున్నాడంటే.. ఆయనలా భార్యకి విడాకులు ఇచ్చేస్తున్నాడు. మరి నేను ఎవరి గురించి చెప్పానో మీకు అర్ధమై ఉంటుంది కదా అంటూ నాగ చైతన్య భార్య సమంత విడాకులు ఇస్తున్నాడు.. అది కూడా లాల్ సింగ్ చడ్డా తో ఈమధ్యనే కలిసి పనిచేసిన.. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ డైరెక్షన్ లో అనే అర్ధంలో కంగనా ఈ ట్వీట్ వేసింది. ప్రస్తుతం కంగనా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.