ఇండస్ట్రీలో నలుగురు, ఐదుగురు పెద్ద హీరోలు భారీ పారితోషకాలు తీసుకుంటున్నారని, వారి కోసం చిన్న హీరోలకి అన్యాయం చెయ్యొద్దు అంటూ ఏపీ ప్రభుత్వానికి మెగాస్టార్ చిరు మొన్న లవ్ స్టోరీ సినిమా ఈవెంట్ లో మొరపెట్టుకునాన్రు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ విషయంపై ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ మినిస్టర్స్ పై రిపబ్లిక్ ఈవెంట్ లో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తర్వాత మినిస్టర్ పేర్ని నాని తో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మీట్ అయ్యి పవన్ కళ్యాణ్ మాటలతో మాకు సంబంధం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పై ఏపీ మినిస్టర్స్ పేర్ని నాని, కొడాలి నాని లాంటి వారు విరుచుకుపడ్డారు.
తాజాగా కొడాలి నాని సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ బెదిరింపులకు ఎవరూ భయపడరు. ఇండస్ట్రీలోని నాలుగు ప్రొడ్యూసర్స్ కోసమో, లేదంటే నలుగురు పెద్ద హీరోల కోసమో ప్రభుత్వం పని చెయ్యదని, 100 రూపాయల టికెట్స్ ని 300 వందలకి అమ్ముతాం అంటే ఊరుకోము.. మేము ఆన్ లైన్ విధానం అంటున్నది అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నాము. ఖచ్చితంగా అందరికి మేలు జరిగే నిర్ణయం తీసుకుంటున్నాము. ఇష్టానుసారంగా టికెట్ రేట్స్ పెంచుతామంటే ఊరుకోము.. అంటూ కొడాలి నాని సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసారు.