నాగ చైతన్య - సమంత విడిపోతున్నట్టుగా ప్రకటించారు. దానితో అక్కినేని అభిమానులు బాగా ఫీలైపోతున్నారు అందమైన జంట, క్యూట్ కపుల్.. ఎందుకు విడిపోయారా అని బాగా ఫీలైపోతున్నారు. సామ్ - చైతు లు సపరేట్ అవుతున్నట్టుగా.. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దానితో అక్కినేని నాగార్జున వీరి విడాకులపై స్పందిస్తూ.. నాగ్ చైతన్య - సమంత విడిపోవడం బాధాకరం అని ట్వీట్ చేసాడు. ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సమంత - నాగ చైతన్య విడిపోవటం చాలా బాధాకరం, దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం.
అక్కినేని ఫ్యామిలీ మెంబెర్ గా కలిసిపోయిన సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. కావాల్సిన వారు. నా కుటుంబంతో సమంత, సమంత తో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. వాళ్ళు విడిపోయినా దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా... వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అంటూ.. నాగ్ సామ్ - చై విడాకులపై స్పందించాడు.