రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫాన్స్ మాత్రమే కాదు.. ముఖ్యంగా బాలీవుడ్ ఎదురు చూస్తుంది. బాహుబలితో ఓ క్రేజ్ ని, ఓ అంచనాలను సెట్ చేసిన రాజమౌళి సినిమా అంటే బాలీవుడ్ కి భయమే. అందుకే బాలీవుడ్ మార్కెట్ పై రాజమౌళి ఎప్పుడు దాడి చేస్తాడో అనే భయంతో ఉన్నారు. ఇప్పటికే అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అనగానే మైదాన్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ఎంతగా రచ్చ చేసారో చూసాం. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో సినిమాల రిలీజ్ డేట్స్ అన్ని మారిపోయాయి. టాలీవుడ్ లో రెండు రోజుల నెలల నుండి సినిమాల రిలీజ్ అవుతున్న మహారాష్ట్రలో థియేటర్స్ క్లోజ్ అవడంతో.. అక్కడ సినిమాల రిలీజ్ లు ఆపేసారు. కానీ అక్టోబర్ చివరి వారం నుండి అక్కడ థియేటర్స్ ఓపెన్ అవడంతో ఒక్కో వారం గ్యాప్ లో సినిమాల రిలీజ్ డేట్స్ ఇచ్చేసారు మేకర్స్.
ఆ తర్వాత అందరూ రాజమౌళి ఇవ్వబోయే ఆర్.ఆర్. ఆర్ డేట్ పై అందరిలో ఆసక్తి హిందీ మేకర్స్ లో ఆత్రుత కనిపించాయి. ఇక తాజాగా రాజమౌళి అందరి ఆత్రుతకి, అందరి సస్పెన్స్ కి తెర దించుతూ అందరూ అనుకున్నట్టుగా జనవారికి లో సినిమా రిలీజ్ ఫిక్స్ చేసాడు. కాకపోతే సంక్రాంతికి పోటీకి రాకుండా ఓ వారం ముందు ఆర్.ఆర్. ఆర్ ని రిలీజ్ చేస్తున్నారు. అంటే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని జనవరి 7 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు. మేకర్స్ ఇంతకు ముందే ఆర్.ఆర్.ఆర్ డేట్ పై అఫీషియల్ ప్రకటన ఇచ్చారు.