మా ఎన్నికల వేడి ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు మధ్యన ఓ రేంజ్ లో రాజుకుంది. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ మధ్యన మాటల తూటాలు పేలుతున్నాయి. మంచు విష్ణు సినిమాల బడ్జెట్ పవన్ కళ్యాణ్ సినిమా మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండవని ప్రకాష్ రాజ్ అంటే.. పవన్ కళ్యాణ్ ఇండీస్ట్రీ వ్యతిరేఖి.. అలాంటి వారికి మీరు సపోర్ట్ చేస్తారా అంటూ మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై వేసుకుంటున్నాడు. మధ్యలో బండ్ల గణేష్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ ద్వారా పోటీ చేద్దామనుకుని.. జీవిత, ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి రాగానే.. అక్కడ నుండి తప్పుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి.. మధ్యలో జీవిత రాజశేఖర్ ని ఓ ఆట ఆడుకున్న బండ్ల గణేష్.. మా ఎన్నికల బరి నుండి తప్పుకున్నట్టుగా ప్రకటించి షాకిచ్చాడు.
అయితే బండ్ల గణేష్ ని ఎవరో తప్పుకొమ్మన్నారని, అందుకే బండ్ల గణేష్ మా ఎన్నికల బరి నుండి తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. తాజాగా బండ్ల గణేష్ మా ఎన్నికల నుండి తప్పుకున్న కారణం ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. బండ్ల గణేష్ మా ఎన్నికల్లో పోటీ చేసి.. మా అసోసియేషన్ ఇసి మెంబర్ ఐతే ప్రోడ్యూసర్ కౌన్సిల్ లో మెంబర్ షిప్ క్యాన్సిల్ అవుతుందని తప్పుకున్నాడు. అంటే ప్రొడ్యూసర్ గా కొనసాగాలి కాబట్టి బండ్ల మా ఎన్నికల నుండి తప్పుకున్నాడన్నమాట. ఇదండీ అసలు విషయం.