అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో.. తెరకెక్కుతున్న పుష్ప పాన్ ఇండియా ఫిలిం ని ఆగష్టు 13 న రిలీజ్ చేస్తున్నట్టుగా అల్లు అర్జున్ జనవరిలోనే ప్రకటించారు. కానీ మధ్యలో సెకండ్ వేవ్ కరోనా, అలాగే టీంలోని కొంతమందికి డెంగ్యూ ఫీవర్ రావడంతో.. పుష్ప సినిమా షూటింగ్స్ కి బ్రేకులు పడుతూ వచ్చాయి. దానితో పుష్ప ని క్రిష్ట్మస్ బరిలో నిలుపుతున్నట్టుగా సుకుమార్ అండ్ టీం ప్రకటించారు. క్రిష్ట్మస్ టార్గెట్ గా పుష్ప మూవీ ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టారు. అయితే పుష్ప కి అఫీషియల్ డేట్ ఇచ్చేసి.. పలు భాషలో రిలీజ్ చేయబోతున్నామని చెప్పినా.. బాలీవుడ్ మూవీస్ క్రిస్టమస్ డేట్ ని ఫిక్స్ చేసాయి. అందులో రన్వీర్ సింగ్ 83 ఉండడంతో.. అదే టైం లో పుష్ప ని రిలీజ్ చేస్తే.. హిందీ మర్కెట్ లో దెబ్బపడుతుంది అంటూ ఇప్పుడు పుష్ప రిలీజ్ డేట్ విషయంలో అందరిలో అనుమానం మొదలైంది.
పుష్ప డేట్ మారబోతుంది అంటూ.. ఒక వారం అంటే క్రిస్టమస్ కి ఒక వారం ముందే పుష్ప థియేటర్స్ లోకి రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతూన్న నేపథ్యంలో పుష్ప మూవీ ని డిసెంబర్ 17 నే అంటే క్రిష్ట్మస్ కి రెండు వారాల ముందే రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా.. అఫీషియల్ ప్రకటన ఇచ్చేసారు. అల్లు అర్జున్ - రష్మిక జంటగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. పుష్ప ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ.. రెండు భాగాలుగానే రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17 న రిలీజ్ చెయ్యబోతుననట్టుగా ప్రకటించారు.