బిగ్ బాస్ సీజన్ 5 లో రోజు రోజుకి బుల్లితెర ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతుంది. అలాగే ఓటింగ్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి అనడానికి ఉదాహరణ గత వారం ఎలిమినేట్ అయిన లహరినే. లహరి అసలు బిగ్ బాస్ నుండి అంత త్వరగా ఎలిమినేట్ అవుతుంది అని ఎవరూ కాదు ఆమె కూడా ఊహించి ఉండదు. యాంకర్ రవి వలన నిష్కారణంగా లహరి హౌస్ నుండి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఈ వారం నామిషన్స్ లో ఏకంగా హౌస్ లోని సగం మంది అంటే 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. యాంకర్ రవి, లోబో, నటరాజ్, సన్నీ, ప్రియా, అని, కాజల్, సిరి ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ కాస్త టఫ్ గానే ఉన్నాయి.
మరి ఈ వారం స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్స్ లో మరీ వీక్ గా ఓట్స్ పడుతున్న కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు. లహరి ఎలిమేట్ అయ్యాక హౌస్ మేట్స్ లో యాంకర్ రవి ని ఎక్కువగా నామినేట్ చేసారు. పక్కాగా బుల్లితెర ప్రేక్షకులు రవిని ఇంటికి పంపేస్తారని అనుకుంటున్నారు కానీ.. అందరికన్నా తక్కువ ఓట్స్ పడుతున్నది మాత్రం నటరాజ్ మాస్టర్ కే అంటున్నారు. నటరాజ్ మాస్టర్ యాటిట్యూడ్, ఇతర కంటెస్టెంట్స్ తో ఉండే తీరు ప్రేక్షకులకి నచ్చడం లేదు అని, అందుకే అందరి కన్నా తక్కువ ఓట్స్ వస్తున్న నటరాజ్ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి బిగ్ బాస్ లీకులు ఈ రోజు రాత్రికే ఆదివారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిసిపోతుంది. ఆదివారం ఎపిసోడ్ శనివారమే జరగడంతో.. ఆ లీకులు బిగ్ బాస్ యాజమాన్యం ఆపలేక చేతులెత్తేసింది.