Advertisementt

ఆర్.ఆర్.ఆర్ హడావిడి ఏమిటండీ..

Fri 01st Oct 2021 10:15 PM
rajamouli,rrr pan india movie,rajamouli rrr,rrr hashtag trending on twitter,ntr,ram charan  ఆర్.ఆర్.ఆర్ హడావిడి ఏమిటండీ..
RRR Hashtag trending on Twitter ఆర్.ఆర్.ఆర్ హడావిడి ఏమిటండీ..
Advertisement
Ads by CJ

అక్టోబర్ 13 నుండి ఆర్.ఆర్.ఆర్ తప్పుకోవడంతో టాలీవుడ్ సినిమాలు చాలావరకు పొలోమంటూ దసరా ని క్యాష్ చేసుకోవడానికి బయలు దేరాయి. వరల్డ్ వైడ్ థియేటర్స్ ఓపెన్ అవ్వని కారణంగా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ని వాయిదా వేశారు. రాజమౌళి పై ఇప్పుడు ఎన్టీఆర్ - రామ్ చరణ్ అభిమానులు అలుగుతున్నారు, ఫైర్ అవుతున్నారు, అడుక్కుంటున్నారు. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చెయ్యమని, ఇప్పటికే బాలీవుడ్ మూవీస్ తలా ఒక డేట్ లాగేసుకున్నాను. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ని ఓ మంచి డేట్ చూసి ఇవ్వాలని రాజమౌళి అండ్ టీం ఆలోచిస్తుంటే.. ఫాన్స్ మాత్రం రాజమౌళి ఇలా నాన్చుతుంటే కష్టమంటున్నారు.  ఇక గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ హడావిడి మాములుగా లేదు.

రేపు ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు అంటూ ఆర్.ఆర్.ఆర్ ని ట్విట్టర్ వేదికగా ట్రెండ్ చేస్తున్నారు ఫాన్స్. టుమారో ఆర్.ఆర్.ఆర్ డేట్ పక్కాగా వచ్చేస్తుంది అంటూ హడావిడి పెడుతున్నారు. కొమరం భీం గా ఎన్టీఆర్ ని, అల్లూరి సీత రామరాజు గా రామ్ చరణ్ ని, రాజమౌళి ని, ఆర్. ఆర్.ఆర్ టైటిల్ ని ఏకధాటిగా ట్రేండింగ్ లో ఉంచుతున్నారు. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య ఏపీ సీఎం చుట్టూ తిరుగుతూన్నారు. ఇక మహారాష్ట్రలోనూ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. మరి ఆ ఆర్.ఆర్.ఆర్ డేట్ ఏదో వదిలితే.. ఫాన్స్ కూల్ అవుతారు.. లేదంటే రాజమౌళి కి అభిమానుల సెగ తగిలేలానే కనిపిస్తుంది. 

RRR Hashtag trending on Twitter :

Rajamouli RRR Hashtag trending on Twitter 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ